Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయేందుకు ఇలా చేస్తే...

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (19:15 IST)
ఇటీవలి కాలంలో చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి మన ఆహారంలో ఓట్స్ చేర్చుకోవాలి. ఓట్స్ మంచి పౌష్టికాహారం. దీనిలోని పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి అధిక మోతాదులో ఉన్నాయి. అలానే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతాయి.
 
పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వలన మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ.. దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది. 40 గ్రాముల ఓట్స్‌లో ఒక రోజుకు సరిపడా మెగ్నీషియం ఉంటుంది.
 
ఓట్స్ రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం ఎంతగానో తోడ్పడుతుంది. తద్వారా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం ఎంతగానే తోడ్పడుతుంది.
 
ఓట్స్‌లో ఉండే బీటా కెరోటిన్ అనే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది. అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహాగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వలన చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. ఓట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి శరీర వాపును తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments