Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరసంగా వుంటే.. ఒకే సీతాఫలం తీసుకోండి..

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (18:50 IST)
నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. కణజాల బలహీనతనీ, ఆస్తమానూ ఈ పండు తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు.

సీతాఫలాల్లో అధికంగా ఉండే బి-విటమిన్, మెదడులో విడుదలయ్యే గాబా న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందట. ఫలితంగా ఒత్తిడి, చికాకులు తగ్గుతాయి. వీటిల్లో అధికంగా ఉండే విటమిన్-సి సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతని తగ్గిస్తుంది.
 
ముఖ్యంగా గర్భిణీలకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. గర్భస్థ శిశువు చర్మం, కళ్లు, జుట్టు పెరుగుదలకూ తోడ్పడతాయి. ఈ పండుని పటికబెల్లంతో కలిపి తింటే పాలిచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి. అలాగే ఇందులోని నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకూ తోడ్పడుతుంది.
 
అన్నింటికన్నా ఇందులో అధికంగా ఉండే కాపర్, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఎంతో అవసరం. ఇది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. గర్భిణులకూ కాపర్ ఎంతో అవసరం. నెలలు నిండకుండా ప్రసవించడాన్ని తగ్గిస్తుంది. వేవిళ్లతో బాధపడేవాళ్లకు వికారాన్నీ తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments