Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాప్యంలో ఎంచక్కా చేపలు తినొచ్చు... లేకుంటే?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (15:43 IST)
అవును. వృద్ధాప్యంలో చాలామంది మాంసాహారాన్ని పక్కనబెట్టేయడం చేస్తుంటారు. అయితే మాంసాహారంలో భాగమైన సీఫుడ్ లిస్టులో వున్న చేపలను మాత్రం వృద్ధాప్యంలో తప్పకుండా తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. మటన్, చికెన్‌ను పక్కనబెట్టేసినా పర్లేదు కానీ.. చేపలను మాత్రం తీసుకోకుండా వుండకూడదని వారు సూచిస్తున్నారు. 
 
వృద్ధాప్యంలో గుండె జబ్బులు, నొప్పులు, అధిక రక్తపోటు వంటి రుగ్మతలు ఎదుర్కోవాల్సి వుంటుంది. వీటికి మందులు తీసుకోవడమే కాకుండా ఆహారంలో రోజుకు పావు కప్పైనా చేపలు తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా వుండే ఈ చేపలను తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. 
 
హైబీపీని పక్కనబెట్టేయవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రపు చేపల్లో పోషకాలు పుష్కలంగా వుంటాయి. చేపల్లో మాంసకృత్తులు, విటమిన్‌ ఎ, విటమిన్‌ డి, ఫాస్ఫరస్‌ వంటివి పుష్కలంగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు అవసరమయ్యే ఫ్లోరిన్‌తో పాటు.. రక్తవృద్ధికి అవసరమయ్యే హీమోగ్లోబిన్‌ పెరగడానికి, అందుకు కావాల్సిన ఇనుము చేపల్లో విరివిగా లభిస్తుంది.
 
అలాగే బానపొట్ట రాకుండా ఉండాలంటే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తినడం మంచిది. అందుకే వయోబేధం లేకుండా చేపలు తీసుకోవచ్చునని.. తద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

తర్వాతి కథనం
Show comments