Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీన్స్ వేసుకుంటే.. వామ్మో ఎన్నో సమస్యలు..

ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. జీన్స్ వేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అయినప్పటికీ.. వాటితో ఏర్పడే అనారోగ్య సమస్యలను వింటే

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (11:01 IST)
ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. జీన్స్ వేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అయినప్పటికీ.. వాటితో ఏర్పడే అనారోగ్య సమస్యలను వింటే షాక్ కాక తప్పరని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీన్స్ ఫ్యాంటులతో కాస్త జాగ్రత్తగా వుండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 
 
చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు బిగుతు జీన్స్‌ వేసుకుంటారు. వీటివల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు శరీరం లోపల నరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. రక్త ప్రసరణ సమస్యలు ఎదురవుతాయి. అలాగే జీన్స్ వేసుకుని కింద కూర్చోవడం కూడదు. కాళ్లు ముడుచుకుని కూర్చోవడం చేయకూడదు. 
 
జీన్స్ ప్యాంట్ వేసుకుని కాళ్లు ముడుచుకుని కూర్చోవడం ద్వారా కండరాలు, నరాలకు దెబ్బ తప్పదని.. అదే అలవాటుగా పెట్టుకుంటే నడవలేని పరిస్థితికి కూడా దారితీయవచ్చునని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా వ్యాయామం చేసే సమయంలో జీన్స్ వేసుకోవడం, జీన్స్ వేసుకుని స్క్వాటింగ్ చేయడం కూడా ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా బిగుతుగా ఉండే జీన్స్‌, టాప్స్‌, హైహీల్స్‌, బరువైన హ్యాండ్‌బ్యాగ్స్‌ శరీరానికి హాని కలిగిస్తాయి. 
 
బరువు ఎక్కువగా ఉండే హ్యాండ్‌ బ్యాగుల వల్ల, ల్యాప్‌టాప్‌ బ్యాగుల వల్ల వెన్నునొప్పి విపరీతంగా వస్తుంది. బరువు మోయడం వల్ల భుజాల నొప్పి, మెడ నొప్పి వస్తాయి. బరువున్న బ్యాగును భుజానికి ఒకవైపే తగిలించుకోవడం వల్ల కూడా వెన్నుపూస వంగిపోయినట్టయి మెడనొప్పి, వెన్ను నొప్పి వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సో.. ఫ్యాషన్ పేరిట లేనిపోని అనారోగ్యో సమస్యలను కొని తెచ్చుకోవద్దని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments