ఈ సీజన్ జామపళ్లు తింటే ఎలాంటి ప్రయోజనం?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (21:01 IST)
జామపళ్లను తింటే త్వరగా జీర్ణం కావని, జలుబు చేస్తుందని అపోహపడుతుంటారు. అయితే అవన్నీనిజం కాదు.  జామపండ్లలో పీచు పదార్థం అధికంగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఉండే పీచు పదార్థం అరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది.
 
జామపండు పైతొక్కలో 'సి' విటమిన్ అధికంగా ఉంటుంది. అదే విధంగా ఇందులో ఏ, బి విటమిన్‌లు అధిక మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా జామపండులోకంటే దోర కాయల్లోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని వైద్యుల అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా జామ ఆకులను చిగుళ్లవాపుకు మందులా కొంతమంది వాడుతుంటారు. 
 
పండిన జామకాయల నుంచి జామ్స్, జెల్లీస్ లాంటివి కూడా తయారు చేస్తున్నారు. జామ ఎసెన్స్‌తో ఇప్పుడు కూల్‌డ్రింకులు కూడా వస్తున్నాయి. పోషక ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం అధికమొత్తంలో లభ్యం కావటమేకాకుండా 28.55 శాతం పీచు పదార్థం లభ్యమవటంవల్ల జామకాయలను షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా వాడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.
 
జామలో 1.05 శాతం మాత్రమే కొవ్వు ఉండటంవల్ల ఊబకాయులు సైతం కావాల్సినన్ని తినవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జామ ఆకుల నుంచి తీసిన ఆయిల్‌ను యాంటీ క్యాన్సర్ మందుగా వాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments