Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ టీని పరగడుపున, రాత్రిపూట తాగకూడదు.. ఎందుకో తెలుసా?

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. కానీ గ్రీన్ టీని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. చాలామంది బరువు తగ్గుతాం కదా అని ఎక్కువసార్లు గ్రీన్ టీ తాగకూడదు. రోజుకు గ్రీన్ టీని ఎన్ని కప్పులు తాగాలి. ఎప్పుడు

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (12:45 IST)
గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. కానీ గ్రీన్ టీని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. చాలామంది బరువు తగ్గుతాం కదా అని ఎక్కువసార్లు గ్రీన్ టీ తాగకూడదు. రోజుకు గ్రీన్ టీని ఎన్ని కప్పులు తాగాలి. ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం.. గ్రీన్ టీని ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు తాగాలి. దీనివల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. 
 
సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలోనూ గ్రీన్ టీని తాగవచ్చు. ఈ రెండు సమయాల్లో గ్రీన్ టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రీన్ టీని ఉదయాన్నే పరగడుపున అస్సలు తాగరాదు. అలా తాగితే లివర్‌పై గ్రీన్ టీ హానికర ప్రభావాన్ని చూపిస్తుంది.
 
రక్తహీనత సమస్య ఉన్న వారు భోజనం చేశాక రెండు గంటల తరువాత గ్రీన్ టీ తాగాలి. లేదంటే శరరీం ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. అలాగే నిద్రపోయే ముందు కూడా గ్రీన్ టీ తాగరాదు. గ్రీన్ టీ వల్ల నిద్రలేమి సమస్య తప్పదు. అందుకే రాత్రిపూట గ్రీన్ టీ తాగరాదు. రోజుకు 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీని తాగవచ్చు.
 
అంతకుమించి తాగితే శరీరం మనం తినే ఆహారం నుంచి పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. దీనివల్ల పోషకాహార లోప సమస్య వస్తుంది. కాబట్టి రోజుకు రెండు కప్పులు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మార్గదర్శి చిట్ ఫండ్‌కు వైకాపా నేత ఆర్కే రోజా లాయల్ కస్టమర్

సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు

కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల

వైఎస్‌ అవినాష్‌రెడ్డి అఫిడవిట్‌లో వివేకానంద హత్య కేసు వివరాలు

పవన్‌కు నాలుగు పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి..

ఆసక్తికి రేకెత్తిస్తున్న వరుణ్ సందేశ్ - నింద పోస్టర్

గుడిని మూసేయండి అంటున్న సీతా కళ్యాణ వైభోగమే టీజర్‌- మంత్రి కోమటి రెడ్డి ఆవిష్కరణ

గ్రామీణ కథతో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం

తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన బాక్ సినిమా వాయిదా

'ఆయుష్ శర్మ నటించిన రుస్లాన్ ఎక్స్ ట్రార్డినరీ మూవీ : విజయేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments