ప్రతి ఒక్కరూ విధిగా చేయించుకోవాల్సి వైద్య పరీక్షలేంటి?
హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ విధిగా సుమారుగా 55 రకాల
హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ విధిగా సుమారుగా 55 రకాల వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచన చేస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక జాబితాను త్వరలోనే విడుదల చేసింది. ఈ పరీక్షలను ప్రతి ఒక్కరూ ప్రతి యేడాది విధిగా చేసుకోవాలని కోరుతోంది.
ప్రభావవంతమైన చికిత్సకు కచ్చితమైన వ్యాధి నిర్ధారణ తొలి అడుగు. వైద్యసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఏ ఒక్కరూ వైద్యసేవల కొరత వల్ల ప్రాణాలు కోల్పోరాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేసెస్ అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా టైప్-2 మధుమేహం ఉన్న వృద్ధుల్లో 46 శాతం మందిని గుర్తించడం లేదన్నారు. హెచ్ఐవీ, టీబీ తరహా ఇన్ఫెక్షన్ వ్యాధులకు ఆలస్యంగా వైద్యపరీక్షలు చేయించుకోవడం వల్ల అవి మరింత వ్యాప్తిచెంది ప్రమాదకర పరిస్థతి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ అనారోగ్య పరిస్థితులను గుర్తించేందుకు నిర్వహించాల్సిన 58 పరీక్షలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వీటన్నింటికీ కలిపి ఓ కనీస ప్యాకేజీగా రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
హెచ్ఐవీ, టీబీ, మలేరియా, హెపటైటిస్ బి, సి, హ్యుమన్ పాపిలోమా వైరస్, సిఫిలిస్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇందులో ఉన్నాయి. తప్పనిసరి వైద్య పరీక్షల జాబితాలో ఉన్న పరీక్షల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే విడుదల చేసింది.