Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్‌ తొక్కే కదా అని తీసిపారేయకండి..

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (14:48 IST)
Apple peel
ఆపిల్‌ మాత్రమే కాదు.. ఆపిల్‌పై నుంచే తొక్క కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఆపిల్ తొక్కలోనూ పోషకాలు పుష్కలంగా వున్నాయని వైద్యులు చెప్తున్నారు. ఆపిల్‌లోని గుజ్జును మాత్రమే తింటూ తొక్కను పారేసే వారు ఇకపై అలా చేయడం ద్వారా పోషకాలను దూరం చేసుకుంటారనే చెప్పాలి. 
 
ఆపిల్ తొక్కలో యాంటీ-యాక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ వంటివి వున్నాయి. ఇవి హృద్రోగ సమస్యలకు చెక్ పెడతాయి. ఆపిల్‌ను తొక్కతో పాటు తీసుకుంటే కంటి పొరకు సంబంధించిన రుగ్మతలు వుండవు. ఆపిల్ తొక్కలో పీచు అధికం. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ అధికం కావడాన్ని నియంత్రించి.. ఒబిసిటీని కంట్రోల్ చేస్తుంది. 
 
ఇంకా ఆపిల్ తొక్కలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ధాతువులు పుష్కలం. అందుకే గర్భిణీ మహిళలు తప్పకుండా ఆపిల్‌ను తీసుకోవాలి. అలాగే ఆపిల్ తొక్కలోని పెక్టిన్ అనే రసాయనం శరీరంలోని ట్యాక్సిన్లను తొలగిస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments