Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి మంచి చేసే వేరుశనగ పప్పు, ఏమేమి వుంటాయి?

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (21:30 IST)
వేరుశెనగలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులతో పాటు.. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్, బోరాన్‌లలు పుష్కళంగా లభిస్తాయి. అంతేగాకుండా వీటిని ఆహారంగా తీసుకోవటంవల్ల విటమిన్‌-ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. అయితే ఇందులో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి కెలొరీలూ అంతే స్థాయిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి.
 
పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తుల పాత్ర అత్యంత కీలకం. అందుకే పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశెనగను మించి ఔషధం లేదు. అదే విధంగా గర్భిణులకు, పాలిచ్చే తల్లులకూ మాంసకృత్తులు వీటినుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశెనగతో రోగ నిరోధక శక్తి పటిష్టం అవుతుంది.
 
వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.
 
ఈ పప్పులోని ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పప్పుతోపాటు వేరుశెనగ నూనె కూడా మంచిదే. అయితే ఇందులో కేవలం ‘ఇ’ విటమిన్‌ మాత్రమే ఉంటుంది.
 
ఎలా వాడాలంటే... ప్రతి రోజూ సుమారు 25 గ్రాముల వేరుశెనగపప్పును ఏదో ఒక రూపంలో పిల్లలకు అందివ్వచ్చు. వీటిలో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి, మోతాదు మించి తీసుకోకూడదు. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ తీసుకోవాల్సిన కెలోరీల్లో కొన్నింటిని మానేసి బదులుగా మాత్రమే వేరుశెనగను ఎంచుకోవాలి. లేదంటే చిన్న చిన్న సమస్యలు తప్పవు. అయితే.. కొంతమందికి వేరుశెనగ పడదు. దీన్ని తిన్నవెంటనే ఎలర్జీ వస్తుంది. అలాంటివారు వెంటనే మానేయడం మేలు. పప్పు మాత్రమే కాకుండా, ఇలాంటివారు వేరుశెనగ నూనె కూడా వాడకపోవటం ఉత్తమం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

తర్వాతి కథనం
Show comments