Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్య సమస్యలన్నిటికీ సమాధానం సజ్జలు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:19 IST)
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు, పెద్దవారు అని వయసుతో సంబంధం లేకుండా ఊబకాయ సమస్య చాలామందిని వేధిస్తుంది. ఈ సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్యకర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం. సరైన వ్యాయామాలు లేకపోవడం.

మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన సజ్జలు కీలక పాత్ర వహిస్తాయి. వాటిలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం.. 
 
1. 100 గ్రాముల సజ్జలలో 3 మి.ల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో తయారుచేసిన పదార్థాలు తినడం చాలా మంచిది.
 
2. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదలవుతాయి. అంతేకాకుండా కండరాలకు ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 
3. షుగర్ వ్యాధితో బాదపడేవారికి సజ్జలు చక్కని ఆహారం. వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన షుగర్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది.
 
4. ఈ స్థూలకాయ సమస్య ఉన్నవారు ప్రతిరోజు మొలకెత్తిన సజ్జలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎదిగే పిల్లలకు సజ్జలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి సజ్జలు దోహదపడతాయి. అంతేకాకుండా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి.
 
5. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలకు మొలకెత్తిన సజ్జలను పెట్టడం ద్వారా ఎత్తు పెరుగుతారు. అంతేకాకుండా ఇవి శరీరాన్ని చలువపరుస్తాయి.
 
6. సజ్జ పిండిలో బెల్లం కలిపి రొట్టెలా చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించి రక్తంలోని కొలస్ట్రాల్ని తగ్గిస్తాయి.
 
7. సజ్జలలో ఇనుము అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలలో, పిల్లల్లో రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాకుండా ఎసిడిటీ, కడుపులో మంట అజీర్ణం, ఇతర ఉదరకోశ సమస్యలకు సజ్జలు దివ్యౌషధం.
 
8. సజ్జలలో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది మన శరీరంలోని కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన శరీరంలోని శక్తిని పెంచి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. మనలోని ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments