Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండు తింటే లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (22:08 IST)
వర్షాకాలం రాగానే మనకు ఎక్కువగా కనబడేవి నేరేడు పండ్లు. ఈ నేరేడు పండ్లు కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు తినడం మంచిది. ఎందుకంటే ఈ పండులో సహజమైన యాసిడ్లు ఉన్నాయి. అవి కాలేయాన్ని శక్తివంతం చేసి దాని పని తీరును మెరుగుపరుస్తాయి.
 
అంతేకాదు నేరేడులోని ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. గింజల్లో జంబోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధి నివారణకు దోహదపడుతుంది. గింజలను ఎండబెట్టి పొడిచేసి రోజుకు రెండుసార్లు ఒక స్పూన్ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిపై చక్కని ప్రభావం చూపుతుంది అని వైద్యులు చెపుతున్నారు.
 
నేరేడు చెట్టు బెరడును నలగ్గొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి కషాయం చేసుకొని దానిలో తేనే కలుపుకొని తాగితే రక్తస్రావం తగ్గిపోతుంది. చెవుల్లో నుంచి చీము కారడం వల్ల బాధ పడే వారికి ఇది చాలా మంచి మందు. ఆకులూ, పండ్లను దంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి రెండు చెవుల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. తొందరగా ఉపశమనం కలుగుతుంది.
 
మహిళల్లో వైట్ డిశ్చార్జ్ తో బాధ పడేవారు ఈ చెట్టు వేర్లను దంచి ముద్ద చేసి బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి తీసుకుంటే రక్త హీనత, వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది. అతిమూత్ర వ్యాధితో బాధ పడేవారు ఈ పండు గింజలను పొడి చేసి ఉదయం ఖాళీ కడుపుతో చన్నీళ్ళతో తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 
మొలలు- పైల్స్‌తో బాధపడే వారికి నేరేడు బాగా పని చేస్తుంది. ఈ పండ్లను అవి దొరికే కాలంలో ప్రతి రోజు ఉదయం ఉప్పుతో కలిపి తింటే మంచి ఫలితం కలినిపిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments