Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించి వివాహం చేసుకున్నారు.. ఐతే విడిపోయారు.. చివరికి.. భార్య..?

Advertiesment
ప్రేమించి వివాహం చేసుకున్నారు.. ఐతే విడిపోయారు.. చివరికి.. భార్య..?
, సోమవారం, 7 సెప్టెంబరు 2020 (22:35 IST)
మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. పెద్దల కుదిర్చిన వివాహాలే కాకుండా ప్రేమ వివాహాలు అర్థాంతంగా ముగిసిపోతున్నాయి. తాజాగా.. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
 
ఎవరికి వారే జీవించాలని అనుకున్నారు. విడిపోదాం అనుకున్నారు. కానీ ఒకరి జీవితంలోకి చొరబడి వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన రచయిత రమణ గౌతమ్‌పై అతని భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిగత సమాచారంతో పాటు నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధిస్తున్నట్టు ఆరోపించింది. గతంలో కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. 
 
అయితే కేసు వాపసు తీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు బాధితురాలు చెప్తోంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో నివసించే రమణగౌతమ్‌ పలు తెలుగు సినిమాల్లో రచయితగా పనిచేశాడు. ప్రేమించి పెళ్లాడినప్పటికీ, ఆమెపై పగ పెంచుకున్నాడు. 
 
తన భార్యను కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తున్నట్టు బాధితురాలు చెప్తోంది. దీంతో ఇద్దరిని పిలిపించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపారు. అయినా అతడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
బాధితురాలికి ఫోన్లు చేసి కేసు వాపసు తీసుకోవాలని , లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి సినీపరిశ్రమలోనే ఉందని, ఆమె స్నేహితుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

96 కాంబో మళ్లీ రిపీట్.. హీరోయిన్ త్రిషనా.. తాప్సీనా..?