కంటిచూపు లేని వ్యక్తి.. ఆరుగురితో వివాహం.. లక్షల్ని కొల్లగొట్టాడు..?!

గురువారం, 9 జనవరి 2020 (18:56 IST)
తమిళనాడు, సేలంలో కంటిచూపు తగ్గిన వ్యక్తి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కంటిచూపు లేని సాకుతో లక్షల రూపాయలను కొల్లగొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లా, సూరమంగళం, అమ్మాపాళయంకు చెందిన వ్యక్తి డేవిడ్ (40). ఇతనిపై అమ్మాపేటకు చెందిన ఆశిష్ అలీ (24) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఆ ఫిర్యాదులో డేవిడ్ తనకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. నాలుగు లక్షలా 25వేల రూపాయలను తీసుకున్నాడని.. ఆపై ఉద్యోగం లేదు.. డబ్బులు లేవన్నట్లు వ్యవహరించి మోసం చేశాడని ఆరోపించాడు. డేవిడ్‌పై ఇదే తరహాలో సూరమంగళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డేవిడ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ విచారణలో డేవిడ్ ఇలా ఆరుగురు మహిళలను వివాహం చేసుకుని మోసం చేసినట్లు వెల్లడి అయ్యింది. తనకు రోడ్డు దాటేటప్పుడు సహాయం చేసే మహిళలకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. లక్షలు తీసుకుని మోసం చేసేవాడని తెలిసింది. ఆ డబ్బుతో ఒక ఊరు వదిలి వేరొక ఊరుకు వెళ్లడం అక్కడ మళ్లీ కొత్త మహిళతో పరిచయం ఏర్పరుచుకోవడం పెళ్లి చేసుకుని.. డబ్బులు గుంజడం ఇతని పని అని తెలియరావడంతో పోలీసులు షాకయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పిల్లలకు మేనమామగా తోడుంటా: జగన్‌