నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఐతే అనారోగ్యం తెచ్చుకున్నట్లే.. ఏం చేయాలి?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:25 IST)
సాధారణంగా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే సామెతను వింటూనే ఉంటాం. ఇది సామెత వరకు అయితే సరి, కానీ నీళ్లు నిలబడి తాగితే మాత్రం చాలా డేంజర్ అంటూ నిపుణులు అంటున్నారు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ, నీళ్లను నిలబడి తాగకూడదని చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీని వలన అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే..ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు... చాలామంది బఫే సిస్టమ్ అంటూ నిలబడి భోజనం చేయడం కూడా జరుగుతూ వుంది. ఇది కూడా ఆరోగ్యానికి హాని కలిగించే అలవాటు అంటున్నారు. ఈ రెండింటినీ కూర్చుని మాత్రమే చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఐతే ఈ రోజుల్లో చాలామంది నిలబడే నీళ్లు, భోజనం లాగించేస్తున్నారు. ఈ అలవాటుని మార్చుకుని ఈ రెండింటినీ కూర్చుని చేస్తే ఆరోగ్యకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్.. బాత్రూమ్‌లో పడిపోయిందని?

వెబ్ సిరీస్‌లో ఛాన్సిస్తానని అలాంటి వీడియో తీసి ఎఫ్‌బీలో అప్ చేశాడు.. ఆపై కేసు

ఆ వంటగది వీడియోలో తప్పు లేనప్పుడు నా కేక్ కటింగులో తప్పు లేదే: దువ్వాడ శ్రీనివాస్

మధ్యాహ్న భోజన పథకం: వారానికి ఒకసారి చికెన్ స్థానంలో చేపలు

మద్యం మత్తులో సోదరుల మధ్య గొడవ.. హత్యకు దారి తీసింది.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Shankar :ఉగాదికి రావాలని వారి కోరిక మేరకు వస్తున్నాం ఆశీర్వదించండి: హరీశ్ శంకర్

Ramcharan: పవన్ కళ్యాత్ తో చిరంజీవి, రామ్ చరణ్ మనోహరమైన దృశ్యం!

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (TGFA) లకు ఎంపికైన చిరంజీవి, నాగచైతన్య, రష్మిక మందన్నా

కేక్ కట్ చేయకూడదని మాకు తెలియదు... ఎగ్ లెస్ కేకే కట్ చేశాం.. దువ్వాడ శ్రీనివాస్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

తర్వాతి కథనం
Show comments