పైనాపిల్ తింటే ఆరోగ్య సమస్యలు ఏమయినా వస్తాయా?

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (23:20 IST)
పైనాపిల్ లోని సోడియం, పొటాషియం టెన్షన్స్‌ను తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ సి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు తగినంత పాలు లభించనట్లయితే అలాంటి వారికి అనాసపండు రసమిస్తే మంచిదంటున్నారు వైద్యులు. 

 
కొంతమందిలో చిగుర్లు, పళ్ల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటి వారు ఈ పండు తీసుకుంటే మంచిది. గొంతు నొప్పి నుంచి బయటపడాలంటే అనాసపండు జ్యూస్ చాలా మంచిది. అనాస రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఫైనాపిల్ రసాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే వయస్సు ప్రభావాన్ని తగ్గిస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడేవారికి ఈ జ్యూస్ దివ్య ఔషధమే.

 
పైనాపిల్ తినడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటారు. పైనాపిల్స్ సాధారణ అలెర్జీ కారకం కాదు. ఐతే కొందరిలో మాత్రం కొన్నిసార్లు ఎలర్జీ తలెత్తుతుంది. అలాంటివారు ఈ పండుకి దూరంగా వుండాలి. మధుమేహం ఉన్న వ్యక్తులు వారి రక్తంలో చక్కెరను స్థిరంగా వున్నప్పుడు వైద్యులు సలహా మేరకు తీసుకోవచ్చు.

 
బ్రోమెలైన్ రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, రక్తాన్ని పలుచబడే మందులు తీసుకునే వ్యక్తులు పైనాపిల్‌ను తీసుకోకపోవడమే మంచిది. పండని పైనాపిల్‌ను ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, వికారం, విరేచనాలు వస్తాయని కొందరు అంటారు. ఐతే దీనిపై ఎలాంటి అధ్యయనం జరగలేదు. పండిన పైనాపిల్‌ను తీసుకుంటే అన్నిరకాలుగా మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్నేహితుల మధ్య గొడవ.. బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి.. వ్యక్తి మృతి

ఆస్తి కోసం మత్తు బిళ్ళలు కలిపిన బిర్యానీ భర్తకు వడ్డించి హత్య

అక్రమం సంబంధం ... వివాహితను హత్య చేసిన వ్యక్తి

అండర్-15 యువతకు సోషల్ మీడియో వినియోగంపై నిషేధం.. ఎక్కడ?

ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 20మంది సేఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్: చిరంజీవి గారు వేరే తరం నుండి వచ్చారు.. ఇప్పుడు పరిస్థితి వేరు.. చిన్మయి

Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెండ్లి విషయంపై తాజా అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments