Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఈ పండ్లు తీసుకుంటే..? ఎండు ద్రాక్షలలో పాలలో మరిగించి? (video)

Webdunia
గురువారం, 21 మే 2020 (15:07 IST)
అసలే వేసవి కాలం. ఎండలు వేడెక్కిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవిలో నీటిశాతం ఎక్కువగా వుండే పండ్లను తీసుకోవాలని అందరికీ తెలుసు. అందుకే పుచ్చకాయ, కీరదోస, కొబ్బరిబోండాం వంటివి తీసుకుంటుంటాం. అయితే వీటితో పాటు కొన్ని పండ్లను తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ పండ్లు ఏంటో ఓసారి చూద్దాం.. 
 
అరటిపండ్లు: జీర్ణశక్తికి రోజూ రాత్రి పూట అరటిపండును తీసుకోవడం మంచిది. అరటిలో కొవ్వు పదార్ధం చాలా అల్ప మోతాదులో ఉంటుంది. శరీరంలోని విషపదార్ధాలను ఇది చక్కగా తొలగిస్తుంది. డయేరియాను తగ్గించడంలో అరటి పండ్లు ఎంతగానో సహాయపడతాయి.
 
సపోటా: సపోటా పండు చర్మానికి తేమనిస్తుంది. ఇంకా చర్మంపై వున్న ముడతలను దూరం చేస్తుంది. రోజూ సపోటాను తీసుకుంటే రక్తవృద్ధి చెందుతుంది. 
 
మామిడి పండు: మామిడిలో విటమిన్ ఎ పుష్కలంగా వుంది. దీన్ని తీసుకుంటే శరీరంలో రక్తవృద్ధి అధికమవుతుంది. శరీరానికి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
జామపండు : జామపండులో విటమిన్ సి పుష్కలంగా వుంది. పెరిగే పిల్లలకు విటమిన్ సి చాలా ముఖ్యం. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలను పటిష్టంగా వుండేలా చేస్తుంది. 
 
దానిమ్మ: రోజూ దానిమ్మ పండు రసాన్ని తీసుకోవడం ద్వారా.. శరీరానికి కొత్త ఉత్సాహం లభిస్తుంది. మెదడుకు చురుకుదనం లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుంది. మానసిక ఒత్తిడి దూరమవుతుంది.
 
వీటితో పాటు ఎండు ద్రాక్షను రోజూ తీసుకుంటే వేసవికాలంలో ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఎండుద్రాక్షలను బాగా నీటిలో కడిగి.. ఆవు పాలలో వేసి మరిగించి ఆరనివ్వాలి. ఆపై పాలలో మరిగించిన ద్రాక్షలను తీసుకుంటే.. ఆ పాలను తీసుకుంటే అజీర్తి సమస్యలు వుండవు. ఇందులోని క్యాల్షియం.. ఎముకలకు, దంతాల బలానికి సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments