Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజీ ఆకుల రసం తీసి తాగితే ఏమవుతుందో తెలుసా? (Video)

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (14:03 IST)
కూరగాయల్లో దేనికదే ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదని వైద్యులు చెపుతుంటారు. ఎందుకంటే ఇది క్యాన్సర్‌ను నిరోధించటంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా అధిక బరువును అడ్డుకోవచ్చు. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తీసుకుంటూ వుంటే పాలు బాగా పడతాయి.
 
క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తీసి తాగినా దగ్గు తగ్గుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని తాగలేనివారు అందులో కొద్దిగా పంచదార కలుపుకుని తాగవచ్చు. రక్తంలో చక్కెరస్థాయిను సమతుల్యం చేసే శక్తి క్యాబేజీకి వుంది.
 
క్యాబేజీలో ఉండే ఐసోసైనేట్లకు క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం కలదని ఇటీవలి పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు ఇది చక్కటి మందుగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దేశంలో ప్రతి సంవత్సరం అనేకమంది ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నవారే కాగా, వారిలో 15 శాతం మంది పొగతాగని వాళ్లే కావడం గమనార్హం. 
 
ఇందులో భాగంగా... పొగతాగనివారిపైన, మహిళలపైన పరిశోధన చేయగా, ప్రతిరోజూ లేదా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా క్యాబేజీ తీసుకుంటున్న వారిలో శ్వాసకోశాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. కాబట్టి, వారానికి ఒకసారి వెజిటబుల్ సలాడ్‌లో సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను కూడా చేర్చి తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
 
క్రూసిఫెరా కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లాంటి వాటిలో ఐసోసైనేట్స్ అనే రసాయనాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే, వీటిని ఎక్కువగా ఉడికిస్తే మాత్రం అందులో ఉన్న యాంటీ కేన్సర్ కారకాలు నశించిపోయే ప్రమాదం ఉంది. అందుకనే క్యాబేజీలను సలాడ్‌గా గానీ, ఆవిరితోగానీ ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

తర్వాతి కథనం
Show comments