Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోడకాకర తింటే ఎంత మేలు జరుగుతుందో తెలుసా?

బోడకాకర తింటే ఎంత మేలు జరుగుతుందో తెలుసా?
, బుధవారం, 12 ఆగస్టు 2020 (13:47 IST)
Spiny Gourd
బోడకాకరలో ఫోలేట్స్ అధికశాతం ఉంటాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిక్ పేషంట్లకు సైతం బోడకాకర ఎంతో మంచిది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. 
 
అలాగే క్యాన్సర్, ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కూడా ఈ కాయ కాపాడుతుంది. ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు వయస్సు పెరగడం వల్ల వచ్చే ముడతలను నియంత్రిస్తాయి. వర్షాకాలం రాగానే మార్కెట్లో విరివిగా కనిపించేవి బోడకాకరకాయలు. అందుకే బోడకాకరతో పులుసు, ఫ్రై, పొడి చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
బోడకాకరలో ఫోలేట్స్ అధికశాతం ఉంటాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది. 
 
ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది. అలాగే క్యాన్సర్ సహా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడగకుండా కూడా ఈ కాయ రక్షిస్తుంది. ఇక చివరగా ఇందులోని ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీపి తినొచ్చు లావు కాకుండా వుండొచ్చు, ఎలా? (video)