Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రపిండాల్లో రాళ్లున్నవారు టమోటా విత్తనాల పౌడరుని తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (23:27 IST)
టమోటాను కెచప్, సాస్, సూప్, జ్యూస్, సలాడ్స్ వంటి రూపాలలో కూడా దీని వినియోగం ఉంటుంది. టమోటా చర్మం, జ్యూస్ మరియు విత్తనాలు వాటి వాటి లక్షణాలను అనుసరించి శారీరిక ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగించడం జరుగుతుంది. 
 
సాధారణంగా టమోటా విత్తనాలను ఎండిన తర్వాత వినియోగించడం జరుగుతుంటుంది, దీనిని పౌడర్ రూపంలో మరియు టమోటా గింజల నూనె రూపంలో వినియోగించడం జరుగుతుంటుంది. వీటిలో అద్భుతమైన సౌందర్య మరియు జీర్ణ సంబంధమైన ప్రయోజనాలు దాగున్నాయి. 
 
వాస్తవానికి టమోటా గింజల వెలుపలి భాగం కఠినతరంగా ఉంటూ, జీర్ణక్రియలకు అంతరాయం కలిగించేలా ఉంటాయి. అయితే మీ పేగుల్లో ఉన్న జీర్ణాశయ సంబంధిత ఆమ్లాలు గింజల వెలుపలి పొరను జీర్ణం చేసి, ఆ తర్వాత మలం ద్వారా శరీరం నుండి వ్యర్ధాలను తొలగిస్తాయి. టమోటా గింజల వలన అపెండిసైటిస్ సమస్య వస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. 
 
నిజానికి విటమిన్ - ఎ మరియు విటమిన్ - సి సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు, డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలకు గొప్ప మూలంగా కూడా చెప్పవచ్చు. అపెండిసైటిస్ సమస్యకు ఇవి ఏమాత్రం కారణం కాజాలదని గుర్తుంచుకోండి. టమోటా విత్తనాల వెలుపలి భాగంలో కనిపించే సహజ సిద్ధమైన జెల్ మీ రక్తప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 
 
ఇది రక్తం గడ్డకట్టకుండా చేయడంలో మరియు రక్త నాళాల ద్వారా మీ రక్తం సజావుగా ప్రవహించడంలో సహాయం చేస్తుంది. అధిక రక్తపోటు మరియు ఇతర హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, తరచుగా వైద్యుల సలహా మేరకు ఆస్పిరిన్ టాబ్లెట్లను తీసుకుంటుంటారు. ఇవి ఉపశమనం కలిగించినప్పటికీ దీర్ఘకాలం వాడటం వలన అల్సర్స్ వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా టమోటా విత్తనాలను తీసుకోవచ్చు. 
 
ఈ గింజలలో ఉండే లక్షణాల వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని కొంత మంది సూచన. టమోటా విత్తనాలలో తగినంత మోతాదులో పీచు పదార్థాలు ఉన్న కారణంగా, జీర్ణక్రియలకు ఎంతో ఉత్తమంగా సహాయపడగలదని చెప్పబడింది. అయితే వీటి వలన దుష్ప్రభావాలు కూడా కొన్ని ఉన్నాయి. 
 
టమోటా గింజల్ని అధిక మోతాదులో తీసుకుంటుంటే, వాటి కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశముందని శాస్త్రీయంగా పేర్కొన్నప్పటికీ ఒక పరిమిత మోతాదు వరకు తీసుకోవచ్చని చెప్పబడుతుంది. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వ్యక్తికి మాత్రం, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ టమోటా విత్తనాలను సూచించడం జరగదు. డైవర్టిక్యులిటిస్ సమస్యతో ఉన్న వ్యక్తులు టమోటా విత్తనాలను వినియోగించకూడదని సలహా ఇవ్వబడుతుంది. పెద్ద పేగులో సంచులు ఏర్పడడం, వాపును తీవ్రతరం చేసే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments