Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖర్జూరాలు తింటే కిడ్నీల్లో రాళ్లు....

ఖర్జూరాలు తింటే కిడ్నీల్లో రాళ్లు....
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (23:25 IST)
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. రాత్రి పూట నీటిలో నాలుగు ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
 
అత్యంత తియ్యగా ఉండే ఈ ఖర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్‌లు అధికంగా ఉంటాయి. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండెకు సంబందించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది.
 
ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి కంటికి చాలా మంచిది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
 
ఖర్జూరాలు ఆరోగ్యకరమైన బరువు పెంచడానికి సహాయపడుతాయి. బాగా సన్నగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. కాబట్టి రోజువారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది.
 
ఇవి ఎముకల దృఢత్వానికి బాగా ఉపకరిస్తాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. దంతాలను దృఢపరచడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్దప్రేగులోని సమస్యలను నివారిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీని అతిగా తాగితే ఏమవుతుంది?