Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతాఫలం సీజన్, రోజుకో సీతాఫలం తీసుకుంటే జరిగే మేలు ఏంటి?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (21:08 IST)
ఇతర పండ్లతో పోల్చుకుంటే సీతాఫలం ధర కూడా తక్కువే. ఇలాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలాల్లో సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. రోజూ ఒక సీతాఫలం పండును తినడం వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్ధాలు బయటకు పంపిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఎ విటమిన్‌ కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుందని వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, జుట్టు ఒత్తుగా పెరగాలని ఆశపడే మహిళలు చక్కగా సీతాఫలం పండ్లను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినడం వల్ల సమస్య అదుపులో ఉంటుందని చెపుతున్నారు.ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, దాని పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
ఈ పండ్లలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయివున్న కొవ్వును కరిగించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలని వైద్యులు చెపుతున్నారు. ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల మేలు జరుగుతుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments