చిప్స్ తిన్నారో అంతే సంగతులు..

రోజూ చిప్స్ తీసుకుంటే వాటిలోని హైఫ్యాట్ కెలోరీల ద్వారా బరువు పెరుగుతారు. ఒబిసిటీ తప్పదు. పది గ్రాముల చిప్స్‌లో 154 కెలోరీలు వుంటాయి. ముఖ్యంగా పొటాటో చిప్స్ ద్వారా ఒబిసిటీ ఖాయమని పరిశోధకులు కూడా తేల్చా

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (18:08 IST)
రోజూ చిప్స్ తీసుకుంటున్నారా? అయితే అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. శరీరానికి ఇది ప్రమాదకరమని.. ఆరోగ్య నిపుణులు చెప్పారు. సమయం దొరికితే చాలు.. గుప్పెడు చిప్స్‌ను చేతిలోకి తీసుకుని కరకర నమిలేస్తే ఆరోగ్యానికి దెబ్బేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఓసారి పర్లేదు కానీ రోజూ అదేపనిగా నూనెలో వేపిన స్నాక్స్‌ను తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు తప్పవో చూద్దాం... 
 
బరువు పెరిగిపోతారు.. 
రోజూ చిప్స్ తీసుకుంటే వాటిలోని హైఫ్యాట్ కెలోరీల ద్వారా బరువు పెరుగుతారు. ఒబిసిటీ తప్పదు. పది గ్రాముల చిప్స్‌లో 154 కెలోరీలు వుంటాయి. ముఖ్యంగా పొటాటో చిప్స్ ద్వారా ఒబిసిటీ ఖాయమని పరిశోధకులు కూడా తేల్చారు. అంతేగాకుండా ప్రోసెస్డ్ మాంసం, చక్కెర అధికంగా కలిగిన జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ వంటివి తీసుకుంటే డయాబెటిస్, హృద్రోగ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
పోషకాలు వుండవు.. 
నూనెల్లో వేపిన ఆహార పదార్థాల్లో ఎలాంటి పోషకాలు వుండవు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు. నూనెల్లో వేపడం ద్వారా వాటిలోని పోషకాలు నశిస్తాయి. అందుకే నూనెతో తయారైన పదార్థాలను పక్కనబెట్టి, సలాడ్లు స్నాక్స్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
హైబీపీ తప్పదు
కరకరలాడే చిప్స్‌లో సోడియం అధిక మోతాదులో వుంటుంది. ఇవి హృద్రోగాలకు కారణమవుతాయి. అంతేగాకుండా హైబీపీకి దారితీస్తాయి. గుండెపోటు, కిడ్నీ సంబంధిత రోగాలు, డయాబెటిస్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
హై కొలెస్ట్రాల్ 
రోజూ పొటాటో చిప్స్ వంటి వాటిని తీసుకుంటే హై కొలెస్ట్రాల్ తప్పదు. డీప్- ఫ్రై చేయడం ద్వారా చిప్స్‌లో ట్రాన్స్‌ఫాట్ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఇంకా నూనెల్లో వేయించే వస్తువుల్లో ట్రాన్స్ ఫాట్స్ అధికంగా వుంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని పెంచేస్తాయి. అందుచేత చిప్స్‌ను స్నాక్స్‌గా తీసుకోకుండా.. ఉడికించిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. వీటిలో హై-సోడియం వుండదు. 
 
గోధుమలతో చేసిన వంటకాలు, మొక్కజొన్నతో చేసిన స్నాక్స్ వంటివి లో కెలోరీలను కలిగివుంటాయి. కూరగాయలతో చేసిన సలాడ్స్, సాండ్‌విజ్‌లు తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అర్థరాత్రి పూట ఆన్‌లైన్ గేమ్స్- వద్దన్నందుకు కత్తితో దాడి.. సోదరి, తండ్రి మృతి

పిల్లనిచ్చిన అత్త ప్రేమలో పడిన అల్లుడు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, వీడియో

సెలవుపై ఇంటికొచ్చి.. ఇంకోదానితో కులుకుతావా..? ఆర్మీ జవాన్‌ను హత్య చేసిన భార్య?

రైల్వే వంతెనను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 15 మందికి గాయాలు.. మరో ముగ్గురు యాత్రికులు...?

తండ్రి నీడలోనే ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్న నారా లోకేష్.. కడియం శ్రీహరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi contravercy : రాంచరణ్ పెద్ది మూవీ పై స్పందించని ప్రముఖులు, దర్శకుడు క్షమాపణ ?

Sunitha: గాయని సునీత తనయుడు ఆకాష్ కు కొత్త మలుపు అవుతుందా..

Ravi Teja: కూతురి కోసం తండ్రిగా ఇరుముడి వేసుకున్న రవితేజ ఏం చేశాడు

Boyapati Srinu: భోళా బాలయ్య సాంగ్ అద్భుతంగా ఉంది : డైరెక్టర్ బోయపాటి శ్రీను

Trisha: త్రిషకు పెళ్లైందా... మెడలో ఆ మంగళసూత్రం ఏంటి... ఎవరు కట్టారు?

తర్వాతి కథనం
Show comments