Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

సెల్వి
శనివారం, 18 మే 2024 (22:17 IST)
ఆదివారం అంటేనే బిర్యానీ.. అప్పుడప్పుడు బిర్యానీ లాగించే వారు మీరైతే ఈ కథనం మీ కోసమే. అప్పుడప్పుడు అంటే వారానికి రెండు లేదా నాలుగైదు సార్లు బిర్యానీ తినే ప్రియులకు ఈ స్టోరీ చాలా అవసరం. బిర్యానీలను ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. 
 
బిర్యానీలో టేస్ట్ కోసం తీసుకుంటే.. అందులోని అధిక కెలోరీలు, మసాలాలు, సోడియం, ఉప్పు శరీరానికి ఇబ్బందులను తెచ్చి పెడతాయి. ఇంకా ఎప్పుడుపడితే అప్పుడు తినివారికి ఎలాంటి సమస్యలు ఏర్పడతాయో చూద్దాం...
 
బిర్యానీలు వారానికి ఓసారైతే పర్లేదు కానీ అదే పనిగా రెండు రోజులకు ఒకసారి.. రాత్రిపూట తీసుకుంటే అందులోకి అధిక కెలోరీలు ఒబిసిటీకి దారితీస్తుంది. తద్వారా మధుమేహం సమస్య తప్పదు. బిర్యానీల్లో అధిక కొవ్వు వుండటంతో రక్తపోటు తలెత్తే ఆస్కారం వుంది. ఇది గుండె సంబంధిత రోగాలకు దారితీస్తుంది. ఇందులోని సోడియం అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. ఇది కిడ్నీ సంబంధిత రోగాలు, పక్షవాతానికి దారితీస్తాయి. 
 
ఇంకా బిర్యానీల్లో వాడే అధిక మోతాదు నూనెల కారణంగా, మసాలాల కారణంగా అజీర్ణ సమస్యలు, కడుపులో మంట వంటి రుగ్మతలు తప్పవు. బిర్యానీలోని పదార్థాలు ముఖ్యంగా మాంసం క్యాన్సర్‌కు దారితీస్తాయి. అందుచేత బిర్యానీని మితంగా తీసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు తప్పవు. బిర్యానీకి బదులు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తాడేపల్లి వైసిపి ఆఫీసుని అంత అర్జంటుగా ఎందుకు కూల్చివేశారో తెలుసా? (video)

సైబరాబాద్: డ్రంక్ డ్రైవ్ చేసిన 385 మంది అరెస్ట్.. రైడర్లు కూడా?

తిరుమలకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత

హైదరాబాద్‌లో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం

అమరావతి నిర్మాణం వేగవంతం- సీఆర్‌డీఏ అధికారులతో చర్చలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

తర్వాతి కథనం
Show comments