Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధిగ్రస్తులు పనసపండు తినవచ్చా? (Video)

Webdunia
బుధవారం, 18 మే 2022 (21:15 IST)
పనస తొనలు తింటే శరీరంలోని రోగ నిరోధరక శక్తి పెరుగుతుంది. శరీరంలోని అనేక రుగ్మతల బారినుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఇది ప్రేగు మరియు లంగ్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది.

 
వీటిలో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండె పోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది. పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఈ పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది. అలాగని మితిమీరి తీసుకోరాదు.

 
ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్నిస్తుంది. పనసపండులో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.

 
పనసపండులో ఉన్న క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలు పెళుసుగా మారే సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.


 

సంబంధిత వార్తలు

మాచర్ల ఘటన- జూన్ 4న ఓట్ల లెక్కింపు.. మూడంచెల భద్రత

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెమల్ అంటూ పేరు.. 102 కిలో మీటర్ల వేగంతో...

ఆ బెంగతోనే నాని అస్వస్థతకు గురయ్యారా..? సోఫాలో కుప్పకూలిపోయారు..

జూన్ 4న మా దేవుడు పిఠాపురంలో అడుగు పెడుతున్నాడు.. పిఠాపురం ఓటర్లు

ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్!!

కొత్త సినిమాను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులకు బాగా నచ్చే చిత్రం ల‌వ్ మీ :దిల్ రాజు

తెలుగు డిఎమ్‌ఎఫ్‌తో మహేష్ బాబు ఫౌండేషన్ సహకారం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా’ నుంచి సాంగ్ రిలీజ్

థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కాజల్ అగర్వాల్ సత్యభామ

అల్లు అర్జున్ పుష్ప -2 ద రూల్ నుంచి శ్రీ‌వ‌ల్లి పై లిరిక‌ల్ సాంగ్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments