Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన శరీరంలో క్యాల్షియం తక్కువైతే, ఈ లక్షణాలు కనిపిస్తాయట..!

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:07 IST)
మన శరీరానికి అత్యంత అవసరమైన మరియు ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం కూడా ఒకటి. సాధారణంగా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండాలన్నా.. గుండె ఆరోగ్యంగా పని చేయాలన్నా, హార్మోన్ల సమతుల్యత, రక్తపోటు, అలాగే బరువు నియంత్రణలో ఉండాలంటే మనకు క్యాల్షియం అవసరమవుతుంది. అంతేకాకుండా ఇతర జీవక్రియలకు కూడా క్యాల్షియం కావాలి. 
 
కానీ కొందరు క్యాల్షియం లోపంతో సతమతమవుతుంటారు. కాల్షియం లోపం ఉన్నట్లు వారికి కూడా తెలియదు. క్యాల్షియం లోపం వల్ల మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఓసారి చూడండి..
 
* కాలు కండరాలు ప‌దే ప‌దే ప‌ట్టేస్తుంటే, క్యాల్షియం లోపం ఉన్న‌ట్లు తెలుసుకోవాలి. కొన్ని సార్లు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా అలా జ‌ర‌గ‌వ‌చ్చు. అయితే ఈ స‌మ‌స్య ఎక్కువ కాలం పాటు ఉన్నట్లయితే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. కాల్షియం లోపం ఉన్న‌ట్లు తేలితే.. వైద్యుడి సూచ‌న మేర‌కు మందులు వాడాలి.
 
* కాల్షియం లోపం ఉంటే చేతి వేళ్లలో గుండు పిన్ను గుచ్చిన‌ట్లు అనిపిస్తుంటుంది. అలాగే వేళ్లు మొద్దుబారిపోయి, స్ప‌ర్శ లేన‌ట్లు అనిపిస్తాయి. 
* త‌ర‌చూ ర‌క్త‌పోటు పెరుగుతుంటే క్యాల్షియం లోపం ఉన్న‌ట్లు గుర్తించి చికిత్స తీసుకోవాలి. 
* చిన్న‌పాటి దెబ్బ లేదా గాయం త‌గిలినా ఎముక‌లు విరిగితే కాల్షియం లోపం ఉన్న‌ట్లు గుర్తించాలి. 
* కాల్షియం లోపం ఉంటే అధిక బ‌రువు త్వ‌ర‌గా తగ్గుతార‌ని, స‌న్న‌గా మారిపోతార‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. 
 
* కాల్షియం లోపం ఉంటే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది.
* చేతి, కాలి వేళ్ల గోర్లు చిట్లుతుంటే దాన్ని కూడా కాల్షియం లోపంగా భావించాలి. 
* రాత్రి పూట నిద్ర‌లో బెడ్‌పై అనేక సార్లు అటు ఇటు దొర్లుతూ ఉన్నా దాన్ని కాల్షియం లోపంగా అనుమానించాలి. డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

తర్వాతి కథనం
Show comments