Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూబెర్రీస్, ఆవకాడో, కోడిగుడ్లు తింటే.. మతిమరుపుకు చెక్..

ఆవకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా.. మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా.. డైట్‌లో తప్పకుండా ఆకుకూ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (10:52 IST)
ఆవకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా.. మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా.. డైట్‌లో తప్పకుండా ఆకుకూరలను రోజు అరకప్పైనా చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా తగ్గిపోతుంటాయి. 
 
మతిమరుపు సమస్యలు ఉత్పన్నం కాకముందే వాటిని జరగకుండా ఉండేలా ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు వంటివి ఎక్కువగా తీసుకుంటే మెదడూ శరీరమూ రెండూ చురుగ్గా పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. ఈ విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లోనూ వెల్లడి అయ్యిందని.. వైద్యులు చెప్తున్నారు. ఆకుకూరల్లోని ల్యూటెన్‌ జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తుందని వారు సూచిస్తున్నారు.
 
అలాగే బ్లూ బెర్రీస్‌లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి. ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లతో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే.. తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. 
 
అంతేగాకుండా సాల్మన్ ఫిష్‌లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మార్చడంలో ఉపయోగపడతాయి. మానసిక ఆందోళనను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments