Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ మతిమరుపుకు చెక్ ఎలా?

చాలామంది పరిస్థితి ఇలానే ఉంటుంది. పని ఒత్తిడి, ఇతరత్రా గాభరా వల్ల చేతిలో ఉన్న వస్తువును సైతం ఎక్కడో పెట్టామనుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత గబుక్కున చేతిలో ఉన్న వస్తువును చూసుకుని ఇదేంటి ఇలా మర్చిపోయాను అనుకుంటారు. అసలు ఈ మతిమరుపును దూరం చేసుకోవాలంట

Advertiesment
health issue
, గురువారం, 1 జూన్ 2017 (22:34 IST)
చాలామంది పరిస్థితి ఇలానే ఉంటుంది. పని ఒత్తిడి, ఇతరత్రా గాభరా వల్ల చేతిలో ఉన్న వస్తువును సైతం ఎక్కడో పెట్టామనుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత గబుక్కున చేతిలో ఉన్న వస్తువును చూసుకుని ఇదేంటి ఇలా మర్చిపోయాను అనుకుంటారు. అసలు ఈ మతిమరుపును దూరం చేసుకోవాలంటే ప్రోటీనులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజులు.. వారాలు మరిచిపోతుంటే ఇదేదో సాధారణం అనుకోకండి. ఇదే అల్జీమర్స్‌కు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
 
అల్జీమర్స్‌ను నివారించడానికి 6 ఉత్తమ ఆహారాలు సహాయపడుతాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఈ పరిస్థితిని కంట్రోల్ చేయవచ్చు. ఈ హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, వేగవంతంగా వచ్చే డెత్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్‌ను నిరోధిస్తుంది. మరి మతిమరుపును దూరం చేసే ఆహారాలేంటో చూద్దాం..
 
1. ఆకుకూరలు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌ను తీసుకోవాలి. ఇవి మెమరీ పవర్‌ను పెంచడానికి ఎక్కువ జ్ఞాపకశక్తి, ఎక్కువ కాలం నిలిచి ఉండేందుకు సహాయపడుతాయి. కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి.
 
2. బాదం, వాల్‌నట్స్ మరియు హాజల్ నట్స్ ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్యకరం మరియు బ్రెయిన్ హెల్త్‌కు అవసరం అయ్యే ఫ్యాట్‌ను కలిగి ఉంటాయి వాల్ నట్స్, బాదం ఎక్కువగా తీసుకొనే వారిలో మెమరీ సామర్థ్యం సమర్థవంతంగా ఉన్నట్టు గుర్తించారు.
 
3. క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్‌లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవి తింటే ఇక రాత్రిళ్లు అంతే... మరేం తినాలో తెలుసా?