Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ కాఫీ తాగితే.. ఎంత మేలో తెలుసా? గర్భిణీ స్త్రీలు మాత్రం?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (13:49 IST)
బ్లాక్ కాఫీ త్రాగితే ఆరోగ్యానికి మంచిదని, పలు రోగాల నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ బ్లాక్ కాఫీ త్రాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు. దానితో పాటు గ్రీన్ టీ కూడా శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


ఉదయం పూట ఓ కప్పు బ్లాక్ కాఫీ, మధ్యాహ్నం ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆర్గానిక్ కాఫీ పొడులతో తయారు చేసే బ్లాక్ కాఫీని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. 
 
ఉదయం బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా రోజంతా చురుకుగా ఉండవచ్చు. ఉదయం ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా శరీర బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట గ్రీన్ టీ తీసుకున్నట్లయితే ఆహారాన్ని మితంగా తీసుకోగలుగుతారు. తద్వారా ఒబిసిటీ దరి చేరదు. బ్లాక్ కాఫీతో దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు, అది మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. బ్లాక్ కాఫీ వల్ల రక్తంలోకి అడ్రినలిన్ విడుదలవుతుందని, దీంతో కొవ్వు కరుగుతుంది. 
 
అలాగే, లివర్ కేన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ రెండు కప్పుల కంటే ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా, బ్లాక్ కాఫీ తాగితే ఒత్తిడికి కూడా దూరంగా ఉండొచ్చనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బ్లాక్ కాఫీని తీసుకోకపోవడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments