ప్యాక్ చేసిన పెరుగు.. వేరుశెనగలు తింటే బరువు పెరిగిపోతారు.. తెలుసా?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (13:10 IST)
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడంలో తప్పు లేదు కానీ.. ప్రోటీన్లు పుష్కలంగా వుండే ఆహార పదార్థాలను అదే పనిగా తీసుకుంటే మాత్రం.. బరువు పెరిగిపోయే ప్రమాదం వుందని న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు.


ప్రోటీన్లు పుష్కలంగా వుండే ఆహారాన్ని తరచూ తీసుకోవడం ద్వారా వాటిలోని చక్కెర స్థాయిలు శరీరంలోకి చేరుతాయి. తద్వారా సులభంగా బరువు పెరిగిపోతుందట. అందుకే అలాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన పెరుగును తీసుకోవడం మంచిది. అంతేకానీ.. ప్యాక్ చేసి షాపుల్లో అమ్మే పెరుగును వాడటం ద్వారా అందులో హై-ప్రోటీన్లు బరువును పెంచేస్తాయి. రోజూ ప్యాక్ చేసిన పెరుగును తింటే మాత్రం ఒబిసిటీ ఖాయం. ఇందులోని కృత్రిమమైన ఫ్లేవర్స్, చక్కెర స్థాయిలు బరువును పెంచేస్తాయని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 
 
అలాగే వర్కౌట్స్ తర్వాత తీసుకునే ప్రోటీన్లు గల బార్స్, ప్రోటీన్ షేక్స్‌ను పక్కనబెట్టేయాలి. అలాగే ప్రోసెస్ చేసిన చీజ్‌ను వాడకపోవడం మంచిది. సాధారణంగా చీజ్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. దీన్ని తరచూ తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇకపోతే.. వేరు శెనగలను మాత్రం మితంగా తీసుకోకపోతే.. బరువు పెరగడంలో ఏ మార్పు లేదంటున్నారు.. పోషకాహార నిపుణులు. 
 
వందగ్రాముల వేరుశెనగల్లో 26గ్రాముల ప్రోటీన్లు వుంటాయి. అంతేకాకుండా.. హై ఫ్యాట్స్, కేలరీస్ మస్తుగా వుంటాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

కోనసీమపై దిష్టి కామెంట్లు.. డిప్యూటీ సీఎంగా అనర్హుడు... ఆయన్ని తొలగించాలి.. నారాయణ

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments