బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే పాలకూర జ్యూస్ పరగడుపున ఒక గ్లాసుడు తాగేస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గించడంలో పాలకూర భేష్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గేందుకు అనేక రకాలుగా డైట్ ఫాలో అవుతుంటారు. అలాంటి వారు కేవలం రోజూ పరగడుపున పాలకూర జ్యూస్ తాగితే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
పాలకూరలో పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో న్యూట్రీషియన్లు వున్నాయి. విటమిన్ బి ఇందులో వుండటంతో శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి ఐరన్‌ను అందిస్తుంది. అంతేగాకుండా.. శరీర కండరాలకు ఆక్సిజన్‌ను అందించి.. కండరాల్లోని అనవసరపు కొవ్వును కరిగిస్తుంది.
అలాంటి పాలకూరను వండకుండా.. ఆకులను శుభ్రంగా కడిగి.. ఆపై మిక్సీలో కొట్టి రోజుకు గ్లాసుడు చొప్పున తీసుకుంటే బరువు ఇట్టే కరిగిపోతుంది. ఇందులో రుచి కోసం కాస్త అల్లం, నిమ్మరసాన్ని చేర్చుకోవచ్చు. ఈ జ్యూస్‌ను చలికాలంలో కూడా తీసుకోవచ్చు. ఇది మెటబాలిజానికి బూస్ట్‌ల పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.