Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొండకాయను డైట్‌లో చేర్చుకుంటే.. మధుమేహం మటాష్ (Video)

వేపుడు, కూరల ద్వారా దొండకాయను డైట్‌లో చేర్చుకుంటూ వుంటాం. అలాంటి దొండకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పుష్కలంగా వుంటాయి. దొండకాయలను ఆహారంలో చ

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (15:00 IST)
వేపుడు, కూరల ద్వారా దొండకాయను డైట్‌లో చేర్చుకుంటూ వుంటాం. అలాంటి దొండకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పుష్కలంగా వుంటాయి. దొండకాయలను ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గుతారు. జలుబు, దగ్గు దరిచేరవు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాల ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. 
 
దొండలోని బి-విటమిన్‌ నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి దొండకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది.  అల్జీమర్స్‌నీ అడ్డుకుంటుంది. ఇందులోని రిబోఫ్లేవిన్‌ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ తగ్గడానికి దోహదపడుతుంది.
 
దొండకాయలోని గుణాలు కాలేయం మీద నేరుగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేందుకూ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకూ దోహదపడతాయి. మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవాళ్లు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలావరకూ రాకుండా నియంత్రిస్తుంది. దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. అదేసమయంలో ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం - సౌదీకి అసదుద్దీన్ ఓవైసీ.. అమెరికాకు శశిథరూర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments