Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొరకాయ తినేవారు ఇది ఖచ్చితంగా చదవాల్సిందే...

సొరకాయ లేదా అనపకాయ. సొరకాయను తెలంగాణా ప్రాంతంలో అనపకాయ అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం లాజనేరియా వల్గారిస్ అంటారు. దీనినే ఇంగ్లీష్‌లో బాటిల్ గార్డ్ అంటారు. వేదకాలం నుంచి మన దేశంలో సొరకాయను సాగు చేస్తున్నారు. మ

Advertiesment
సొరకాయ తినేవారు ఇది ఖచ్చితంగా చదవాల్సిందే...
, మంగళవారం, 14 నవంబరు 2017 (21:23 IST)
సొరకాయ లేదా అనపకాయ. సొరకాయను తెలంగాణా ప్రాంతంలో అనపకాయ అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం లాజనేరియా వల్గారిస్ అంటారు. దీనినే ఇంగ్లీష్‌లో బాటిల్ గార్డ్ అంటారు. వేదకాలం నుంచి మన దేశంలో సొరకాయను సాగు చేస్తున్నారు. మానవజాతికి ఏనాడో పరిచయమైన అతి ప్రాచీనమైన కూరగాయ సొరకాయ.
 
సొరకాయ పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ క్రీస్తు పూర్వం 11 వేల నుంచి 13 వేల సంవత్సరంలో పెరులో సొరకాయ సాగు జరిగిందని పురాతన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎండిన సొరకాయపై తొడుగును సొరకాయ బుర్ర అని అంటారు. దీనిలో నీరు పోసుకుని పొలాలకు తీసుకుని అలవాటు చాలామందికి ఉంది. అందులోని నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. అందుకే సొరకాయను నేచురల్ వాటర్ బాటిల్, నేచురల్ మినీకూలర్‌గా చెబుతుంటారు. పూర్వకాలంలో పెద్దవారు సొరకాయలోని నీళ్ళు తాగబట్టే మనవాళ్ళు అన్ని సంవత్సరాల పాటు బతికేవారట. 
 
సొరకాయ కూరే కాదు.. సొర బూరలు కూడా చాలా ఫేమస్. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. శరీరం విపరీతమైన వేడితో బాధపడేవారు దీని రసం తాగడం వల్ల శరీరాన్ని కూల్ చేస్తుంది. సొరకాయలో నీటి శాతం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 
 
మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి. ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుండటం, చాలామందికి నిద్రపట్టకుండా కళ్ళు మంటలు వస్తాయి. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్ర సమస్యను అధిగమించవచ్చు. సొరకాయ సులభంగా జీర్ణమవుతుంది. మూత్రనాల జబ్బులకు సొరకాయ చాలా మంచిది. మలబద్థక, కాలేయ సమస్యను ఉన్నవారికి సొరకాయ చాలా మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారమే జీవితమైతే ఎంత ప్రమాదకరమో...