Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట కొవ్వు యమా డేంజర్... కరిగించుకోండి ఇలా..?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (12:05 IST)
పొట్ట కొవ్వు యమా డేంజర్. కాబట్టి బొజ్జ తగ్గేందుకు తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే పొట్ట పెరిగిపోతుంది. ఇంకా సరైన వ్యాయామం లేకపోవడం ద్వారా పొట్ట తగ్గదు. అయితే పొట్ట కొవ్వు పెరిగితే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే పొట్ట కొవ్వును త్వరలోనే కరిగించాలి. ఈ పొట్ట కొవ్వు తగ్గాలంటే.. డైట్‌లో వాము చేర్చుకోవాలి. 
 
అధిక బరువును తగ్గించుకునేందుకు వాము బాగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్‌ నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్‌ వాము వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని చల్చార్చి రోజులో కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. దీంతో చాలా త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట దగ్గర కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇంకా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సబ్జా గింజలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్‌ ఏ, ఈ, కే, బీలు ఉంటాయి. అలాగే, డైటరీ ఫైబర్‌, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి. తద్వారా అధిక బరువును తగ్గిస్తాయి.
 
బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ను కరిగించి, అధిక బరువును తగ్గించడంలో పెసర్లు ప్రముఖపాత్ర పోషిస్తాయి. వీటిలో విటమిన్‌ ఏ, బీ, సీ,ఈతోపాటు అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిస్తాయి. నిత్యం ఒక కప్పు పెసర్లను ఉడకబెట్టుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు గోధుమ రవ్వను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా వుండటంతో పాటు పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments