లెనోవో యోగా స్లిమ్ 7ఐని భారత్‌లో ఆవిష్కరించారు. ఇది పదో తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇంకా 60Wh బ్యాటరీని కలిగి ఉంది. లెనోవా యోగా స్లిమ్ 7i స్క్రీన్‌తో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇది స్లిమ్, లైట్ డిజైన్‌తో ఉంటుంది. ల్యాప్‌టాప్‌కు ప్రత్యేకమైన జిపియును ఎంపిక చేశారు. లెనోవా క్యూ-కంట్రోల్ ఇంటెలిజెంట్ కూలింగ్ ఫీచర్‌తో ఇది పనిచేస్తోంది.
లెనోవో యోగా స్లిమ్ 7ఐ రూ.79,990కి లభిస్తుంది. ఇది గ్రే కలర్‌లో అందుబాటులో వుంటుంది. ఆగస్టు 20వ తేదీ నుంచి ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుంది. అంతేగాకుండా.. లెనోవాడాట్‌కామ్ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఇంకా అమేజాన్, ఫ్లిఫ్ కార్ట్, ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలోనూ ఆగస్టు 14 నుంచి లభించనుంది.
లెనోవో యోగా స్లిమ్ 7ఐ ఫీచర్స్
ప్రీ-ఇన్స్‌స్టాల్డ్ విండో 10,
ఫుల్ హెచ్డీ (1,920x1,080 పిక్సెల్స్)
ఐపీఎస్ డిస్‌ప్లే, 90 శాతం స్కీన్-టు- బాడీరేటియో
డోల్బీ విజన్ సపోర్ట్
10వ జెనరేషన్ ఇంటెల్ ఐస్-లేక్ కోర్ ఐ7 సీపీయూ,
2జీబీ VRAM
16 జీబీ LPDDR4X RAM, 3,200MHz స్టోరేజ్.