Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి దివ్యౌషధం మునగాకు.. పాలకంటే 16 రెట్లు..?

మునగాకులో పాలకంటే 16 రెట్లు అధికంగా క్యాల్షియం వుంటుంది. అందుకే వారానికి రెండుసార్లు మునగాకును తీసుకునే వారిలో ఎముకలు దృఢంగా మారుతాయి. మునగాకు ఎదిగే పిల్లలకు ఎంతో మేలుచేస్తుంది. దంత, ఎముకల సమస్యలను ని

Webdunia
సోమవారం, 9 జులై 2018 (10:11 IST)
మునగాకులో పాలకంటే 16 రెట్లు అధికంగా క్యాల్షియం వుంటుంది. అందుకే వారానికి రెండుసార్లు మునగాకును తీసుకునే వారిలో ఎముకలు దృఢంగా మారుతాయి. మునగాకు ఎదిగే పిల్లలకు ఎంతో మేలుచేస్తుంది. దంత, ఎముకల సమస్యలను నివారిస్తుంది. అలాగే అరటి పండ్ల కంటే 15 రెట్లు పొటాషియం మునగాకు ద్వారా అందుతుంది. దీంతో హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. 
 
శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. మున‌గాకును రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తింటున్నా లేదంటే మున‌గ ఆకుల‌ను ఎండ‌బెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ తీసుకుంటున్నా మధుమేహం దరిచేరదు. రోజుకు ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకుంటే రక్తంలో చక్కెర లెవల్స్ తగ్గాయని ఇప్పటికే పలు పరిశోధనలు తేల్చాయి. వీటిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ద్వారా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచవచ్చు. మునగాకు ఐదు రకాల క్యాన్లర్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
అలాగే లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించడంలో మునగాకు ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందుగానూ మునగాకు పనిచేస్తుంది. అలాగే మునగాకు రసాన్ని రోజూ తాగితే దృష్టి మాంద్యం, రేచీకటి తగ్గుతాయి. గర్భిణీ మహిళలకు, బాలింతలకు మునగాకు రసం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది. మునగాకు రసాన్ని పాలల్లో క‌లిపి పిల్లలకు అందిస్తే ఎముకలు బలంగా తయారవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments