ప్రతిరోజూ జీడిపప్పు తీసుకుంటే? కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు?
జీడిపప్పులో విటమిన్ బి6, సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గుండెకు ఎంతో సహాయపడుతుంది. మెగ్నిషియం నిల్వలు ఇందులో అధికంగా ఉండడం వలన ఎముకల బలానికి చ
జీడిపప్పులో విటమిన్ బి6, సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గుండెకు ఎంతో సహాయపడుతుంది. మెగ్నిషియం నిల్వలు ఇందులో అధికంగా ఉండడం వలన ఎముకల బలానికి చాలా దోహదపడుతుంది. మన శరీరానికిక సుమారు 300 నుండి 750 గ్రాముల మెగ్నిషియం అవసరమవుతుంది. కనుక జీడిపప్పును రోజు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ సమస్యలను అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్ జీడిపప్పులో అధికంగా ఉంటాయి. జీడిపప్పును తింటే నేత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది. ఇది బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. రోజూ జీడిపప్పును తీసుకుంటే నెల రోజుల్లో 30 శాతం వరకు బరువు తగ్గవచ్చని అధ్యాయనంలో తెలియజేశారు.
గుండె జబ్బులు నుండి ఉపశమనం పొందవచ్చును. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. బీపీని నియంత్రించుటలో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. శరీరానికి అవసరమయ్యే విటిమన్స్, మినరల్స్ జీడిపప్పు ద్వారా లభిస్తాయి. దీంతో హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి.