బరువును తగ్గించే కలబంద..

Webdunia
బుధవారం, 22 మే 2019 (18:37 IST)
కలబంద చాలా రకాలుగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు, దీనిని అనేక సౌందర్య ఉత్పత్తులలో, షాంపూలలో ఉపయోగిస్తుంటారు, కలబందను తినడం వలన కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా స్థూలకాయంతో బాధపడేవారు వ్యాయామం చేయడంతోపాటు దీనిని తీసుకుంటే మంచిది. వీరు ప్రతిరోజూ కలబంద రసాన్ని త్రాగాలి. 
 
కలబంద శరీర అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఈ కలబంద రసం జీర్ణక్రియలు పెంచుటకు చక్కగా సహాయపడుతుంది. అల్లం వేసి మరిగించిన నీటిలో కలబంద రసం వేసి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కాలను కూడా పాటించవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 
 
అధిక బరువును తగ్గించడంలో గ్రీన్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో కలబంద రసం వేసుకుని వేడిచేసి ఉదయం పూట, రాత్రి పూట తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
స్ట్రాబెర్రీ పండ్లు కూడా అధిక బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు స్ట్రాబెర్రీ పండ్లు తింటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీ-నీట్‌ 2026కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం - టెలిగ్రామ్ సేవలు నిలిపివేత

హోర్ముజ్ జలసంధి ద్వారా టోల్ ఫ్రీ షిప్పింగ్ ప్రారంభం.. డొనాల్డ్ ట్రంప్

ఆస్ట్రేలియన్లు వార్తా పత్రికలు చదవట్లేదట.. కారణం ఏంటంటే?

మల్కాపురంలో నావికాదళ అధికారి భార్య ఆత్మహత్య

వైమానిక దళ అధికారి భార్యపై అత్యాచారానికి పాల్పడిన పాత స్నేహితులు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

Samantha: హిట్లతో అహంకారం పెరిగింది, రిటైర్మెంట్ ఆలోచించలేదు : సమంత ప్రభు

తర్వాతి కథనం
Show comments