ఆల్కహాల్‌ను తక్కువ మొత్తంలో తీసుకుంటే.. విదేశీ భాషలపై పట్టు సాధించవచ్చునట..!

ఆల్కహాల్‌ను తక్కువ మొత్తంలో తీసుకుంటే విదేశీ భాషా నైపుణ్యాలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ ఆల్కహాల్ తక్కువ మొత్తంలో తీసుకోవాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (12:03 IST)
ఆల్కహాల్‌ను తక్కువ మొత్తంలో తీసుకుంటే విదేశీ భాషా నైపుణ్యాలు పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ ఆల్కహాల్ తక్కువ మొత్తంలో తీసుకోవాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.

తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం ద్వారానే ఇతర దేశాలకు చెందిన భాషలపై పట్టు సాధించడం కుదురుతుందని డ‌చ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న 50 మంది జ‌ర్మ‌న్ విద్యార్థుల‌పై లివ‌ర్‌పూల్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. కానీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ప్రమాదమని నొక్కి వక్కాణిస్తున్నారు. 
 
ఇప్పుడిప్పుడే డ‌చ్ భాష నేర్చుకుంటున్న జ‌ర్మ‌న్ విద్యార్థుల్లో కొంత‌మందికి త‌క్కువ మోతాదులో ఆల్క‌హాల్ ఉన్న డ్రింక్ ఇచ్చి, మ‌రి కొంత‌మందికి ఆల్క‌హాల్ లేని డ్రింక్‌ను ఇచ్చారు. త‌ర్వాత వారిని ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఆల్క‌హాల్ తీసుకున్న వారు డ‌చ్ భాషను స్ప‌ష్టంగా ప‌లికిన‌ట్లు, మాట్లాడేట‌పుడు కూడా ఏ మాత్రం త‌డ‌బ‌డ‌లేద‌ని పరిశోధకులు తెలిపారు. ఆల్క‌హాల్ తీసుకున్న‌పుడు ఆత్మ‌స్థైర్యం పెర‌గ‌డం వ‌ల్ల వాళ్లు కొత్త‌గా నేర్చుకున్న భాష‌ను స్ప‌ష్టంగా మాట్లాడ‌గ‌లిగార‌ని, ఆల్క‌హాల్ తీసుకోని వారు త‌డ‌బ‌డ్డార‌ని పరిశోధకులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాబోయే బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సర్కారు

పెళ్లి మండపంలో మానవ బాంబు దాడి.. ఆరుగురు మృతి

నటుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు- తుపాకీ స్వాధీనం

గోదావరి పుష్కరాలు.. సీఎం చంద్రబాబు సమీక్ష..మూడోసారి ముచ్చటగా..

రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్..భారత్ ఫ్యూచర్ సిటీకి యూఏఈ ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushmita Konidela : గోల్డ్ బాక్స్ తో నూతన చాప్టర్ బిగిన్స్ అంటున్న సుష్మిత కొణిదెల

ట్రోలింగ్ చేస్తే ఏంటి ప్రయోజనం.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. రేణు దేశాయ్

Chiru: చిరంజీవి చిత్రం విశ్వంభర మళ్ళీ తెరముందుకు రాబోతుందా?

చాయ్ వాలా చిత్రం అందరికీ కనెక్ట్ కవుతుంది : సిటీ కమిషనర్ సజ్జనార్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

తర్వాతి కథనం
Show comments