సీతాఫలం హెల్త్ సీక్రెట్స్ ఇవే

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (22:55 IST)
సీతాఫలం. ఈ పండ్లలో విటమిన్లు, లవణాలు అధికంగా ఉంటాయి. సీతాఫలం మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో నోరూరిస్తుంది. ఎన్నో పోషక విలువలను శరీరానికి అందించే సీతాఫలం గురించి తెలుసుకుందాము. సీతాఫలంలో కొవ్వు ఏమాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీల వరకు శక్తి ఉంటుంది. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.
 
ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతమై బలహీనత, సాధారణ అలసటను దూరం చేస్తుంది.
వాంతులు, తలనొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. సీతాఫలం ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది, కుదుళ్లకు దృఢత్వానిస్తుంది.
 
పేగుల్లో వుండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది. ఆస్తమా ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలంను తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తినకూడదు.

ఎక్కువగా పండిన పండును తింటే గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండి, చక్కెర వ్యాధిగ్రస్తులకు హాని చేస్తుంది. లివర్‌ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అమరావతి: రాజధాని అభివృద్ధికి రైతుల అండ.. భూమిని విరాళంగా ఇవ్వడంపై చర్చ

పంజాబ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి బాగోతం.. ఇంట్లో నోట్ల కట్టలు

ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారు.. షెడ్యూల్ ఇదే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments