Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి!

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (09:12 IST)
ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం.. సరైన పద్దతిలో కూర్చోకపోవడం వలన వెన్నునొప్పి అధికంగా వేధిస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులను ఉపయోగిస్తుంటారు.

ఈ నొప్పి రోజులు కాదు.. సంవత్సరాల తరబడిఫ్ బాధిస్తుంటుంది. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వైద్యులు ఆహారం వెన్ను నొప్పిని తగ్గిస్తుందని తెలిపారు. మన భారతీయ వంటకాలలో ఉపయోగించే అనేక రకాల ఆహార పదార్థాలు వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయట. 
 
ట్యూనా చేపలో అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని ఇతర నొప్పి, మంటను తగ్గిస్తుంది.
 
సాల్మాన్ చేప.. ఇందులో కూడా అనేక రకాల పోషక విటమిన్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 ఉండడం వలన నొప్పి, మంటను తగ్గిస్తాయి. దీనికి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం మంచిది.
 
క్యారెట్లు.. ఇది శరీరానికి మేలు చేసే అత్యంత పోషకాహారం. ఇది వెన్ను నొప్పిని తగ్గించడమే కాకుండా.. అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండడం వలన రోజూవారీ డైట్ లో తీసుకోవడం మేలు.
 
స్వీట్ పోటాటో.. అంటే చిలగడదుంపలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెన్ను నొప్పిని క్రమంగా తగ్గించడమే కాకుండా.. ఇతర సమస్యలను తొలగిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
 
నట్స్.. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో మంచి కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. బాదం, జీడిపప్పు ప్రతి రోజూ తీసుకోవడం వలన వెన్ను నొప్పి తగ్గుతుంది.
 
గ్రీన్ టీ.. ఇది కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. కానీ దీంతో చాలా ప్రయజనాలున్నాయని ఎవరికి తెలియదు. గ్రీన్ టీ కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో సహయపడుతుందని అనేక అధ్యాయనాల్లో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments