Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకుంటే అనారోగ్యం, ఏంటవి?

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (20:53 IST)
భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటు శరీరానికి చాలా ప్రమాదకరం. ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.


కాబట్టి శాశ్వత పిత్తం వంటి సమస్యలు రావచ్చు. వైద్యు నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గుతుంది. ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది.

 
అలాగే భోజనం చేసిన వెంటనే మద్యం తాగే అలవాటు కొంతమందికి వుంటుంది. అది శరీరానికి చాలా హానికరం. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది వివిధ ప్రేగు సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది. అందువల్ల, భోజనానికి ముందు లేదా తర్వాత కనీసం అరగంట పాటు మద్యం సేవించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

 
మరికొందరు భోజనం తిన్న వెంటనే సిగరెట్ తాగుతుంటారు. ఇలాంటి అలవాటు వున్నవారు తక్షణమే దాన్ని మానుకోవాలి. భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. ఇది కడుపులో అల్సర్‌లకు దారితీస్తుంది.

 
భోజనం చేసిన తర్వాత కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. భోజనం చేసిన వెంటనే చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారం జీర్ణం కాదు. ఇది జీర్ణ శక్తిని కూడా తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments