Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలాక్స్ రిలాక్స్, ఈ మర్దనతో రిలాక్స్

Advertiesment
రిలాక్స్ రిలాక్స్, ఈ మర్దనతో రిలాక్స్
, గురువారం, 3 జూన్ 2021 (17:24 IST)
నాలుగైదు చుక్కల నూనెతో మెల్లగా మర్దన చేయాలి. రెండుమూడు వేళ్లతో కండరాల మీద ఒత్తిడి చేస్తూ మసాజ్‌ మొదలెడితే మంచిది. వీలైనంతవరకు బొటన వేలితో ఒత్తిడిని పెంచాలి.
 
ఈ మసాజ్‌ వల్ల శరీరంలో అనుకోని మార్పులు జరిగి సత్వరమే రిలాక్సేషన్‌ లభిస్తుంది. శరీరంలోకి కొత్త శక్తి వచ్చి చేరుతుంది. ఈ మసాజ్ వల్ల కండరాల్లో అక్కడక్కడ ఏర్పడిన బ్లాకేజీలు తొలగి, రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శక్తి శరీరమంతా వ్యాపిస్తుంది.
 
దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిగుతుగా ఉండే సాక్సులు, షూస్‌ వేసుకోవడం వల్ల అరికాళ్లకు గాలి తగలదు. ఒట్టి కాళ్లతో నేల మీద నడిచేందుకు వీలుండదు. తద్వార రక్తప్రసరణ సరిగా సాగదు. కాబట్టి షూష్‌ ఎక్కువగా వేసుకునే వాళ్లు  వారానికి మూడుసార్లు అయినా కాళ్లను మసాజ్‌ చేయించుకుంటే మంచిది అని నిపుణులు చెపుతున్నారు. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగితే ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు దరి చేరవు. 
 
మహిళలు గర్భం దాల్చినప్పుడు కాళ్ల వాపులు సహజం. ఎక్కువ దూరం నడవకపోవడం వల్ల కాళ్ల నొప్పులు మొదలవుతాయి. వాపులు ఎక్కువయ్యే కొద్దీ ఇతరత్రా సమస్యలు వస్తాయి. ఇటువంటి వాళ్లు రోజూ పడుకునేప్పుడు పదిహేను నిమిషాల పాటు అరికాళ్లకు మసాజ్‌లు చేయించుకుంటే ఉత్తమం. డిప్రెషన్‌, యాంగ్జయిటీ, స్ట్రెస్.... ఇవన్నీ మెల్లగా మనిషి ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే జబ్బులు. వీటిని తగ్గించుకోవటానికి రిలాక్సేషన్‌ టెక్నిక్‌లు అనుసరించాలి. ఈ టెక్నిక్స్‌లో అద్భుత ఫలితాలనిస్తుంది ఫుట్‌ మసాజ్‌. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత లభిస్తుంది.
 
మెనోపాజ్‌, పిఎంఎస్‌ సమస్యలు అనేకం. ఉన్నట్లుండి మూడ్‌ మారిపోవడం, చికాకు, కోపం, తలనొప్పి, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి ఇవన్నీ పట్టుకుంటాయి. ఈ సమస్యలతో బాధపడేవాళ్లు.. ఫుట్‌ మసాజ్‌ను ఆశ్రయించొచ్చు. రోజూ చేసుకుంటే సమస్యలు కొంత వరకు తగ్గుతాయనడంలో సందేహం లేదు. ఆఫీసులో పని ఒత్తిడి, లక్ష్యాల వల్ల ఆందోళన, ఒత్తిడి కలుగుతుంటుంది. వేళకు తినకపోవడం, జంక్‌ఫుడ్‌ను ఆశ్రయించడం, జీర్ణశక్తి తగ్గడం వంటి అనేక రకాల సమస్యల వల్ల అధిక రక్తపోటు వస్తుంది. రోజుకు కనీసం పది నిమిషాల పాటు ఫుట్‌ మసాజ్‌ చేసుకుంటే అధిక రక్తపోటు ద్వారా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్ర‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్నారా? అయితే ఈ సింపుల్ టెక్నిక్స్‌ను ఫాలో అవ్వండి!