నిద్రలేమి… వినడానికి చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి ఇదో నరకం. మనకు వచ్చే చాలా వరకు అనారోగ్యాలకు సరిపడ నిద్ర లేకపోవడమే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కంటి నిండ నిద్ర ఉంటే సగం రోగాలు పరారవుతాయి.
ఈ క్రమంలోనే నిద్రలేమితో సతమతమయ్యే వారు.. ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి నిద్ర మాత్రలకు, మద్యపానానికి అలవాటు పడుతుంటారు. ఇవి కచ్చితంగా ఆరోగ్యానికి హాని చేసేవే.. మరి సహజంగా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయనే విషయం మీకు తెలుసా.? అవేంటో ఓసారి తెలుసుకుందాం పదండి..
మీరు నిద్రించే గది శుభ్రంగా ఉండేలా చూసుకోండి. గదిలో చిందర వందరగా ఉంటే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. దీని ద్వారా మీ శరీరం దానికి అలవాటు పడుతుంది. ఆదివారం హాలీడే కదా ఎక్కువ సేపు పడుకుంటామంటే కుదరదు వారాంతాల్లో కూడా ఒకే టైమ్ టేబుల్‌ను పక్కాగా పాటించాల్సిందే.
ఇక పడక గదిలో లైట్ లేకుండా చూసుకోవాలి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం రాత్రి పూట లైట్ ఉంటే నిద్రకు ఉపక్రమించేందుకు ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది నిద్రలేమి దారి తీస్తుంది. కాబట్టి పడుకునే గదిలో లైట్‌లు లేకుండా చూసుకోవాలి. చిన్న బెడ్ లైట్ వేసుకుంటే సరిపోద్ది.
పడుకునే ముందు స్మార్ట్ ఫోన్‌లకు దూరంగా ఉండాలి. నిద్రపోయే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ను వాడకూడదు. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కళ్లపై ఒత్తిడిపెరుగుతుంది. ఇక మొబైల్ ఫోన్‌ను తలకు దగ్గర పెట్టుకోకూడదు.
నిద్రకు ఉపక్రమించే ఆరు గంటల ముందు నుంచి కాఫీలకు దూరంగా ఉండాలి. కెఫీన్ ఉండే చాక్లెట్లకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా నిద్రపోవాలంటే మద్యపానానికి దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. ఆల్కహల్ తీసుకుంటే నిద్ర వచ్చినట్లే అనిపించినా.. మధ్యలో నిద్రకు ఆటంకం కలుగుతుంది.
పడుకునే ముందు ఎక్కువ మోతాదులో, స్పైసీ ఆహారం తీసుకోవడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలతో నిద్రకు దూరమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి రాత్రి వీలైనంత వరకు లైట్ ఫుడ్ తీసుకోవాలి.
నిద్ర రావడానికి అద్భుతమైన చిట్కాలు
1. రాత్రి నిద్రించే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని రెండు ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
2. గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలు వేసుకుని నిద్రించే ముందు ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పిలుస్తూ ఉండాలి.
3. దువ్వెనతో తలవెంట్రుకలను ఇచ్చానుసారం , ఇష్టం వచ్చినంత సేపు దూవ్వుచున్న ఎడల నిద్ర వచ్చును.
4. మృదువైన హస్తాలతో అరికాళ్ళలో మెల్ల మెల్లగా మర్దన చేయించుకున్న ఎడల తప్పకుండా నిద్రవచ్చును.
5. రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు ఆముదము నూనె లేదానువ్వుల నూనె , లేదాకొబ్బరి నూనె మర్దన చేయాలి.
6. రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలు తాగాలి.
7. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడకండి.
8. రాత్రి నిద్రించేటప్పుడు తల పక్కన మొబైల్ పెట్టుకొని పడుకోకండి. దూరంగా పెట్టండి రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు
9. రోజూ రాత్రి నిద్రించే ముందు కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. ఓంకారం, మ్యూజిక్ పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి.