Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంత ప్రయత్నించినా నిద్ర రావడంలేదా? ఇలా చేస్తే..

ఎంత ప్రయత్నించినా నిద్ర రావడంలేదా? ఇలా చేస్తే..
, శనివారం, 29 మే 2021 (23:10 IST)
ఇటీవలి కాలంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఐతే ఇలా నిద్రపట్టకుండా బాధపడేవారు కొన్ని చిట్కాలు పాటిస్తే.. నిద్ర దానంతట అదే ముంచుకొస్తుంది. అవేమిటో తెలుసుకుందాం.
 
అరటిపండ్లు
నిద్రకు ఉపక్రమించడానికి ముందు రెండుమూడు అరటి పండ్లను ఆరగిస్తే సరి. అరటికాయల్లో వుండే మెగ్నీషియం, పొటాషియం కండరాలను రిలాక్స్ చేసి శరీరానికి విశ్రాంతినివ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా నిద్ర తన్నుకొస్తుంది.
 
రాగిజావ లేదా సగ్గుబియ్యం జావ
పడుకునే ముందు తేలిగ్గా జీర్ణమయ్యే రాగి జావ లేదంటే సగ్గుబియ్యం జావ పాలతో కలుపుకుని తీసుకుంటే త్వరగా నిద్రపట్టేస్తుంది. అలా కాకుండా నాన్-వెజ్ ఐటమ్స్, మసాలాతో కూడిన పదార్థాలు తీసుకుంటే నిద్ర పట్టేందుకు తిప్పలు తప్పవు.
 
చిలకడ దుంపలు
చిలకడ దుంపలు( స్వీట్ పొటాటోస్) నిద్ర పట్టేందుకు బాగా సహకరిస్తాయి. ఇందులో వుండే కార్బోహైడ్రేట్లు, పొటాషియం నిద్ర వచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి నిద్ర రాక తిప్పలుపడేవారు చక్కగా చిలకడ దుంప తింటే సరి.
 
పాలు
ఇది అందరికీ తెలిసిన విషయమే. నిద్రించే ముందు పాలు తాగితే నిద్ర తన్నుకుంటూ వచ్చేస్తుంది. దీనికి కారణం పాలలో వుండే ట్రైప్టోఫాన్ కారణం. ఇది నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది.
 
హెర్బల్ టీ
కెఫైన్ లేనటువంటి హెర్బల్ టీ తాగడం వల్ల కూడా నిద్ర పట్టేస్తుంది. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు నిద్రమాత్రలు వేసుకుని వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడకంటే చక్కగా ప్రకృతి అందించిన పదార్థాలు తీసుకుంటే నిద్ర పట్టేస్తుంది.
 
1. చెర్రీస్
తీయతీయగా పుల్లపుల్లగా వుండే చెర్రీస్ అంటే తెలియని వారు వుండరు. వీటిని తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. ఎందుకంటే వీటిలో మెలోటనిన్ వుంటుంది. ఇది నిద్రపట్టడానికి కారణమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రలో మే 29, సంఘటనలు వివరాలు