Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లిస్తున్న ప్రధాని మోడీ సర్కారు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (07:33 IST)
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఈ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు కేంద్రం మరో అప్పును చేస్తుంది. ఫలితంగా కేంద్రం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది.
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో రూ.45 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో సొంత ఆదాయం వాటా మూడింట రెండు వంతులు కూడా లేదు. అంటే సొంత ఆదాయం రూ.26,32,281 కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తం రూ.17,86,1816 కోట్లు అప్పే. అది బడ్జెట్ మొత్తంలో మూడో వంతు కన్నా ఎక్కువగా ఉంది. ఖర్చులోనూ భారీ మొత్తం అప్పులపై వడ్డీల చెల్లింపులకే తరలిపోతుంది. 
 
గత కొన్నేళ్లుగా కేంద్రం చెల్లిస్తున్న వడ్డీల మొత్తం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.8.05 లక్షల కోట్లు చెల్లించగా అది 2022-23 నాటికి ఈ మొత్తం రూ.9.40 లక్షల కోట్లకు చేరింది. వచ్చే అర్థిక సంవత్సరానికి ఇది రూ.10.79 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. మొత్తం వ్యయంలో ఇది నాలుగో వంతు వరకు ఉంటుంది ఇప్పటివరకు కేంద్రం చేసిన అప్పులు గత యేడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి రూ.147 లక్షల కోట్లకు చేరాయి. అందులే విదేశీ అప్పుల వాటాయే రూ.50 లక్షల కోట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments