ఎఫ్ 1 కారు తయారీ ఖర్చు ఎంతో తెలుసా ?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (18:03 IST)
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్ రేస్ ఎఫ్1. రెప్పపాటులో కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే వేగం, ప్రమాదకరమైన మలుపులు, పరీక్షించే ట్రాక్‌లు, పోటీపడే ప్రత్యర్థులు... ఫార్ములా వన్‌ను తలచుకోగానే ఈ దృశ్యాలే కనిపిస్తాయి. అయితే ఈ ఫార్ములా వన్ రేసింగ్ గురించి నివ్వెరపోయే వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. 
 
* ఎఫ్1 ఛాంపియన్‌షిప్ రేసులో ఫెరారీ, రెడ్‌బుల్ మెర్సిడెజ్ వంటి కంపెనీల కార్లు పాల్గొనడం కోసం ఆ కంపెనీలు ఒక్కొక్కటి దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. ఎఫ్ 1 రేసులో విజేతగా నిలిచిన డ్రైవర్‌కు నగదు బహుమతి కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది.
 
* ఎఫ్ 1 రేసులో ట్రాక్ మీద పోటీపడే కారు ధర దాదాపు 100 కోట్ల రూపాయలు, దానికి ఇతర విడి భాగాలు చేర్చితే ఆ ఖర్చు మరింత పెరుగుతుంది.
 
* ఎఫ్ 1 కారు జీవితకాలం రెండు గంటలు మాత్రమే, రెండు గంటల తర్వాత ఆ కారు రేసింగ్‌కు పనికిరాదు.
 
* ఒక ఎఫ్ 1 కారును తయారు చేయాలంటే దాదాపు 80 వేల విడి భాగాలను కలపాలి. వీటిలో ప్రతి భాగాన్ని చాలా జాగ్రత్తగా అమర్చాలి లేకుంటే ట్రాక్‌పైన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందట.
 
* ఎఫ్ 1 కారు కేవలం నాలుగు సెకన్లలోనే 160 కి.మీ వేగాన్ని అందుకుంటుంది, అలాగే అదే నాలుగు సెకన్లలో తిరిగి 0 వేగానికి రాగలదు.
 
* రేసింగ్‌లో  పాల్గొనే సమయంలో అధిక ఉక్కపోత కారణంగా చెమట ఎక్కువగా పట్టడంతో రేసు పూర్తయ్యే సరికి ఒక డ్రైవర్ సగటున నాలుగు కిలోల బరువు తగ్గుతాడు.
 
* ఒక ఎఫ్ 1 కారు రేస్ ట్రాక్ మీదకు రావాలంటే దాదాపు 1000 మంది సిబ్బంది శ్రమించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments