Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022-23 వార్షిక బడ్జెట్ : మధ్యతరగతిపై వరాల జల్లు?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (14:43 IST)
కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట నిచ్చేలా రెండు కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, వ్యక్తిగత పన్నుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, స్టాండర్డ్ డిడక్షన్. అంటే ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకోవచ్చు. 2005-06లో ఈ విధానాన్ని ఎత్తివేశారు. తిరిగి 2018-19లో ఈ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. మొదట రూ.40 వేలుగా ఆ తర్వాత రూ.50 వేలుగా పెంచింది. 
 
ఇపుడు దీన్ని మరికొంత పెంచే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, గతయేడాది మాదిరిగా రూ.10 వేలు పెంచి సరిపెట్టుకుంటారా లేదా అన్నది తెలియాల్సివుంది. 
 
మరోవైపు, కొన్ని సంవత్సరాలుగా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. అంటే సెక్షన్ 80సీ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే వెసులుబాటు ఉంది. ఇది పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. 
 
ఈ నేపథ్యంలో చిన్నారుల విద్య కోసం చేసే పొదుపు మొత్తం, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపై కూడా కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టిసారించినట్టు సమాచారం. 
 
అలాగే, వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయ పన్ను పరిమితిని కూడా పెంచాలన్న డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సివుంది. ఈ అంశాలపై వార్షిక బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments