Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూ యాప్‌తో జతకట్టిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్

Advertiesment
కూ యాప్‌తో జతకట్టిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్
, సోమవారం, 6 డిశెంబరు 2021 (23:33 IST)
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు భాష యొక్క ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశ బహుళ భాషా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారం కూ యొక్క హోల్డింగ్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
 
భారతీయ భాషల అభివృద్ధిని సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వంచే స్థాపించబడిన CIIL, యాప్ యొక్క కంటెంట్ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్‌లైన్‌లో సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి "కూ" తో కలిసి పని చేయనుంది. ఆన్‌లైన్ బెదిరింపులు, నిందార్ధకమైన మరియు దూరీతమైన వాతావరణం నుండి యూజర్లకు రక్షణ కల్పించడానికి మరియు పారదర్శకమైన ప్లాట్‌ఫారం రూపొందించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుంది.
 
ఈ పరస్పర సహకారం ద్వారా భారత రాజ్యాంగంలోని VIII షెడ్యూల్‌లో 22 భాషలలోని  అభ్యంతరకరమైనవిగా లేదా సున్నితమైనవిగా పరిగణించబడే పదాలు, పదబంధాలు, సంక్షిప్తాలు మరియు సంక్షిప్త పదాలతో సహా విషయ వ్యక్తీకరణల కార్పస్‌ను CIIL తయారుచేస్తుంది. ప్రతిగా కార్పస్‌ను తయారుచేయడానికి సంబంధిత డేటాను కూ యాప్ షేర్ చేస్తుంది. అలాగే పబ్లిక్ యాక్సెస్ కోసం కార్పస్‌ను హోస్ట్ చేసే ఇంటర్‌ఫేస్‌లను రూపొందించడానికి సాంకేతిక మద్దతు అందిస్తుంది. సోషల్ మీడియాలో భారతీయ భాషల బాధ్యతాయుతమైన వాడుకను అభివృద్ధి చేయడం కోసం ఇది దీర్ఘకాలిక పరస్పర సహకారం. వినియోగదారులకు సురక్షితమైన & ఆకర్షణీయమైన నెట్‌వర్కింగ్ అనుభవాన్ని అనేక భాషల్లో అందించడానికి ఈ ఒప్పందం రెండేళ్లు చెల్లుతుంది.
 
ఎన్నడూలేని విధంగా భారతీయ భాషల్లోని అభ్యంతరకరమైన, అగౌరవకరమైన లేదా అవమానకరమైనవిగా పరిగణించబడే పదాలు మరియు విషయ వ్యక్తీకరణల నిఘంటువులను తయారుచేసి సమర్థవంతమైన కంటెంట్ నియంత్రణను అందించడమే లక్ష్యంగా పెట్టుకుని CIIL మరియు కూ యాప్ జతకట్టాయి. ఇలాంటి వినూత్న ప్రయత్నం మన దేశంలో జరగడం ఇదే మొదటిసారి.
 
"దీన్ని స్వాగతిస్తూ, భారతీయ భాషా వినియోగదారులను కూ ప్లాట్‌ఫారం లో సంభాషించడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించడం, సమానత్వం మరియు వాక్ స్వాతంత్య్రానికి మన రాజ్యాంగం ఇచ్చే విలువల యొక్క అభివ్యక్తీకరణం అని CIIL డైరెక్టర్ ప్రొఫెసర్ శైలేంద్ర మోహన్ గమనించారు. CIIL మరియు కూ మధ్య అవగాహన ఒప్పందం ద్వారా  సోషల్ మీడియాలో, ముఖ్యంగా కూ యాప్‌లో శబ్ద/పాఠ్య పరిశుభ్రత వస్తుంది. అలాగే అనుచితమైన భాష మరియు దుర్వినియోగం లేకుండా ఉండేలా చూసుకోవడానికి ఇదొక మంచి ప్రయత్నం. సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించే దిశగా కూ యొక్క ఈ ఆలోచనను ప్రోత్సహిస్తూ, కూ యాప్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రొఫెసర్ మోహన్ అన్నారు. కాబట్టి, కార్పస్ ద్వారా CIIL లాంగ్వేజ్ కన్సల్టెన్సీని అందించి బాధ్యతాయుతమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ను తయారుచేయడానికి కూ టీమ్‌ను బలోపేతం చేస్తుంది.
 
ఈ ఒప్పందం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుపుతూ కూ యాప్ సహ వ్యవస్థాపకుడు- సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “భారతీయులు బహుళ భాషల్లో సంభాషించడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పించే ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారంగా దుర్వినియోగాన్ని అరికట్టి ఆన్‌లైన్‌ వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా మాయూజర్లను మరింత బలోపేతం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. తమ భాషా సంస్కృతులలోని వ్యక్తులతో అర్థవంతంగా సంభాషించడానికి ప్లాట్‌ఫారం ను ఉపయోగించాలని మేము యూజర్లను కోరుకుంటున్నాము. ఈ కార్పస్‌ను నిర్మించడానికి మరియు ఇంటర్‌కనెక్టడ్ ప్రపంచాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడానికి ప్రఖ్యాత సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో భాగస్వామిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము.
 
స్థానిక భారతీయ భాషలలో స్వీయ వ్యక్తీకరణ కోసం ఒక ప్రత్యేక వేదికైన కూ యాప్ ప్రస్తుతం తొమ్మిది భాషల్లో వినూత్న ఫీచర్లు అందిస్తుంది. త్వరలోనే మొత్తం 22 అధికారిక భారతీయ భాషలను కవర్ చేసే విధంగా అడుగులు వేస్తుంది. CIILతో ఈ సహకారం ద్వారా కూ యాప్ స్థానిక భాషలలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉపయోగించే పదాల తర్కం, వ్యాకరణం మరియు సందర్భంపై లోతైన, సూక్ష్మమైన అవగాహనను అభివృద్ధి చేస్తుంది. అలాగే, అసమ్మతి, ఆన్‌లైన్ బెదిరింపులకు దారితీసే అభ్యంతరకరమైన పదాలను, వాక్యాలను, పదబంధాలను గుర్తించడంలో సహాయం చేస్తుంది. ఈ అవగాహన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారం లో కంటెంట్ నియంత్రణను మెరుగుపరచడంతో పాటు వినియోగదారులకు వారి సంబంధిత భాషలలో మరింత ఆకర్షణీయమైన కంటెంట్‌ను క్యూరేట్ చేయడానికి సహాయపడుతుంది. తద్వారా భారతదేశపు ప్రముఖ బహుళ భాషా సోషల్ మీడియా ప్లాట్‌ఫారం  కూ యొక్క స్థానాన్ని ఏకీకృతం చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదుగురి మహిళలతో భర్త వివాహేతర సంబంధం, భార్య కూడా అలా చేయడంతో...