బ్రిటన్‌కు రైట్ రైట్... యూఏఈ పొడగించిన నిషేధం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (12:26 IST)
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయిలో ఉంది. ప్రతి రోజూ 3.80 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో భారత విమాన రాకపోకలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇలాంటి దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. 
 
ఇక్కడ ప్రతిరోజూ నమోదయ్యే కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తుండటంతో ఏప్రిల్ 24 యూకేకు విమానాలను రద్దు చేశారు. అయితే మే 1 శనివారం నుంచి ఈ దేశానికి విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. 
 
ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి యూకేలోని హెత్‌రో విమానాశ్రయానికి ఈ విమానాలు ప్రయాణిస్తాయి. మే 1 నుంచి 15 వరకూ ఇలా పాక్షిక సేవలు అందించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎయిరిండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది.
 
మరోవైపు, భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా ఇండియన్ ప్రయాణికులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. మే 14 వరకు భారత ప్రయాణికులకు యూఏఈలో ప్రవేశం లేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా తెలిసింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సమాచారం అందించింది. 
 
కాగా, ఇక ఈ నెల 24 నుంచి భారత విమానాల రాకపోకలపై యూఏఈ పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. 10 రోజుల పాటు భారత్ నుంచి యూఏఈ వచ్చే అన్నీ విమానాలను క్యాన్సిల్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments