Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కో భారతీయుడి తలపై ఎంత రుణభారం ఉందో తెలుసా?

విదేశాల్లో నల్లధనం రూపంలో మగ్గుతున్న భారతీయ సంపదను వెనక్కి తెచ్చి.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 వేల చొప్పున వేస్తానని గత ఎన్నికల సమయంలో బీజేపీ తరపున నాటి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ చేసిన వాగ్ద

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (11:32 IST)
విదేశాల్లో నల్లధనం రూపంలో మగ్గుతున్న భారతీయ సంపదను వెనక్కి తెచ్చి.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 వేల చొప్పున వేస్తానని గత ఎన్నికల సమయంలో బీజేపీ తరపున నాటి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ చేసిన వాగ్దానం. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనం మాట సంగతి పక్కనపెడితే.. స్వదేశంలోని నల్లకుబేరుల భరతం పట్టే పనిలో ప్రధాని మోడీ సర్కారు నిమగ్నమైనట్టుగా ఉంది. ఈ సంగతి అటుంచితే... 
 
ఇపుడు ప్రతి భారతీయడి తలపై సుమారుగా రూ.54 వేల విదేశీ రుణభారంగా ఉంది. తాము చెల్లించే ఈఎంఐలు, వ్యక్తిగత రుణాలకు ఈ రుణభారానికి సంబంధం లేదు. ఇవికాకుండానే ఒక్కో వ్యక్తి తలపై రూ.54 వేల విదేశీ అప్పు ఉంది. దేశ మొత్తం విదేశీ రుణ భారం 2016 మార్చి 31 నాటికి రూ.32.2 లక్షల కోట్లు. దీన్ని భారత్‌లోని ప్రతి ఒక్కరికీ కేటాయిస్తే ఒక్కొక్కరికి రూ.53,796 రుణభారంగా ఉంటుంది. వాస్తవానికి ఈ రుణభారం గత 2009-10లో రూ.30,171గా ఉండగా, 2013-14 నాటికి ఇది రూ.45,319కు చేరుకుంది. అలాగే, 2014-15 సంవత్సరంలో రూ.49,270గాను, 2015-16 నాటికి రూ.53,796కు పెరిగింది. 
 
అంతేనా విదేశీ రుణాలకు దేశం చెల్లిస్తున్న వడ్డీల భారం కూడా నానాటికీ పెరిగిపోతోంది. గత 2009-10లో రూ.213 కోట్లు చెల్లించారు. అలాగే, 2013-14లో ఇది రూ.374 కోట్లుగాను, 2014-15లో రూ.402 కోట్లుగాను, రూ.2015-16లో రూ.442 కోట్లకు పెరిగింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం జీడీపీలో భారత్ విదేశీ రుణభారం 50 శాతం కాగా, అమెరికా రుణభారం 97 శాతం, జపాన్ రుణభారం 202 శాతంగా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments